టాలీవుడ్ లో ఫిబ్రవరి ధమాకా.. సినిమాలే సినిమాలు

కరోనా తర్వాత ఓటిటికి ఎంత బాగా అలవాటు పడ్డా… ధియేటర్ ఎక్స్ పీరియన్స్ రాదు కాబట్టి.. మూవీ లవర్స్ అంతా ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాల కోసం వెయిట్ చేస్తూనే ఉంటున్నారు. దీంతో మేకర్స్ కూడా కొత్త తరహా సినిమాలతో వస్తున్నారు. అయితే టాలీవుడ్ కి ఫిబ్రవరి డ్రై సీజన్. ఈ నెలలో పెద్దగా క్రేజ్ ఉన్న సినిమాలు రావు. కానీ ఈ సారి మాత్రం క్రేజ్ ఉన్న సినిమాలే కాదు… దాదాపు 20 సినిమాల వరకూ రాబోతున్నాయి. వాటిల్లో చూడాల్సినే సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.


సంక్రాంతి సీజన్ తర్వాత మళ్ళీ సమ్మర్ వచ్చే వరకు….ఈ మధ్యలో ఫిబ్రవరి, మార్చిలో పెద్ద సినిమాలు రావు. మీడియం బడ్జెట్ చిత్రాలు కూడా తక్కువే. కానీ ఈ సారి మాత్రం ఫిబ్రవరిలో మీడియం బడ్జెట్ చిత్రాలు, చిన్న చిత్రాలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అయ్యాయి. ఏకంగా 20 సినిమాల వరకూ ఫిబ్రవరి నెలలో రాబోతున్నాయి. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కూడా ఉన్నాయి.


ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో 3వ తేదీన మైఖేల్ సినిమా వస్తోంది. సందీప్ కిషన్ నటించిన పాన్ ఇండియా మూవీ ఇది. పాన్ ఇండియా లెవల్లో ఆ రోజే ఐదు భాషల్లో వస్తోంది. విజయ్ సేతుపతి కూడా నటించడంతో మైఖేల్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. ఇదే రోజు కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ మూవీ వస్తోంది. ఈ మూవీ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కొత్త తరహా పాయింట్ తో సినిమా తెరకెక్కించినట్లనిపిస్తోంది.


ఇక ఫిబ్రవరి 4న బుట్టబొమ్మ అనే సినిమా వస్తోంది. సితార సంస్థ నుంచి వస్తున్న సినిమా ఇది. రూరల్ డ్రామా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో అనికా సురేంద్రన్, అర్జున్ దాస్, నవ్య కీలక పాత్రల్లో నటించారు. ట్రైలర్ రిలీజై ఆకట్టుకుంటోంది. మొత్తంగా మైఖేల్, రైటర్ పద్మభూషణ్, బుట్టబొమ్మ చిత్రాలతో పాటు సాయి రామ్ శంకర్ కొత్త సినిమా వెయ్ దరువెయ్ మూవీతో పాటు మరో రెండు చిన్న సినిమాలు కూడా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ధియేటర్లలో సందడి చేయబోతున్నాయి.


ఫిబ్రవరి సెకండ్ వీక్ లో కళ్యాణ్ రామ్ కొత్త సినిమా అమిగోస్ వస్తోంది. ఇందులో కళ్యాణ్ రామ్ త్రిబుల్ రోల్ చేయడం విశేషం. ఆషికా రంగనాథ్ హీరోయిన్. టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రిలీజైన పాటలకు కూడా మంచి అప్లాజ్ వస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 10న విడుదలవుతోంది. బింబిసార తర్వాత వస్తున్న సినిమా కావడంతో అమిగోస్ పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇదే రోజున బ్రేక్ అవుట్, తమాషా, చెడ్డీ గ్యాంగ్ అనే మూడు చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి.


ఫిబ్రవరిలో థర్డ్ వీక్ వస్తున్న సినిమాలపై టాలీవుడ్లో మూవీ లవర్స్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ కనిపస్తోంది. శివరాత్రి కానుకగా ఒక రోజు ముందే…అంటే 17న మూడు క్రేజీ సినిమాలు వస్తున్నాయి. వాటిల్లో శాకుంతలం ఒకటి. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా ఇది. శకుంతల, దుష్యంతుల ప్రేమకథగా విజువల్ ఎఫెక్ట్సే హైలైట్ గా తెరకెక్కిన సినిమా ఇది. శాకుంతలం పాన్ ఇండియా లెవల్లో రాబోతుంది.


-17న మరో రెండు సినిమాలొస్తున్నాయి. వాటిల్లో థమ్కీ ఒకటి. విశ్వక్ సేన్ హీరోగా నటించి డైరెక్ట్ చేసిన మూవీ ఇది. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన థమ్కీ నుంచి ఇప్పటికే కొన్ని సాంగ్స్ రిలీజై మెప్పిస్తున్నాయి. టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై బజ్ పెరిగింది. ఇక అదే రోజున ధనుష్ నటించిన సార్ కూడా రాబోతుంది. తెలుగు, తమిళంలో వెంక అట్లూరి డైరెక్షన్లో నాగవంశీ నిర్మించిన సినిమా ఇది. సంయుక్త మీనన్ హీరోయిన్. ధనుష్ తెలుగులో చేస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో సార్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది.


ఫిబ్రవరి 17నే శాకుంతలం, దాస్ కా ధమ్కీ, సార్ చిత్రాలతో పాటు కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమా వస్తోంది. ఇది కూడా యూత్ పుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిందే. సాంగ్స్, టీజర్లతో సినిమాపై బజ్ పెంచారు మేకర్స్. ప్రమోషన్స్ కూడా ఫుల్ గా చేస్తున్నారు. ఇక ఫిబ్రవరి నాలుగో వారంలో కూడా మరిన్ని చిన్న సినిమాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ప్రతి సంవత్సరం డ్రై సీజన్ గా ఉండే ఫిబ్రవరిలో ఈ సారి మాత్రం… చిన్నా, మీడియం బడ్జెట్ చిత్రాలతో ధియేటర్లు సందడిగా మారబోతున్నాయి. మరి వీటిల్లో ఎన్ని ప్రేక్షకుల మెప్పు పొందుతాయో చూడాలి.

Related Posts