బాలయ్య రాకపోతే.. నేను వచ్చేస్తా అంటున్న వెంకీ
Latest Movies Tollywood

బాలయ్య రాకపోతే.. నేను వచ్చేస్తా అంటున్న వెంకీ

నందమూరి నట సింహం బాలకృష్ణ – ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ.. కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం గోవాలో తాజా షెడ్యూల్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను దసరాకి విడుదల చేయనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ దసరాకి రావడం లేదు. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రావాల్సిన డేట్ అయిన అక్టోబర్ 13న అఖండ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ఇదిలా ఉంటే.. అక్టోబర్ 13న అఖండ రాకపోతే.. నేను వచ్చేస్తా అంటున్నారు విక్టరీ వెంకటేష్. ఇంతకీ విషయం ఏంటంటే.. వెంకీ నటించిన నారప్ప చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేశారు. దీనికి ఆశించిన స్ధాయిలో స్పందన రాలేదు. ఇది వెంకీని బాగా అప్ సెట్ చేసిందట. నారప్ప సినిమాతో పాటు దృశ్యం 2 చిత్రాన్ని కూడా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సురేష్ బాబు అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే.. ఇప్పుడు థియేటర్లో సినిమా చూడడానికి జనం వస్తుండడం.. రానున్నది దసరా సీజన్ కావడంతో దృశ్యం 2 సినిమాను థియేటర్లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట సురేష్ బాబు.

ప్రస్తుతం ఈ విషయమై ఏ ఓటీటీ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ సంస్థతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడం కోసం చర్చలు జరుపుతున్నారని తెలిసింది. ఈ నెలాఖరు లోపు దృశ్యం 2 థియేటర్ రిలీజ్ పై క్లారిటీ వస్తుంది అంటున్నారు. మరి.. దృశ్యం 2 ధియేటర్లో విడుదల అయితే.. వెంకీ అభిమానులకు పండగే.

Post Comment