ఇచ్చట వాహనాలు నిలుపరాదు – రివ్యూ
Latest Movies Reviews Tollywood

ఇచ్చట వాహనాలు నిలుపరాదు – రివ్యూ

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ఇచ్చట వాహనాలు నిలుపురాదు. ఈ చిత్రం ద్వారా ఎస్ దర్శన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. వెంకట్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం కీలక పాత్రలలో నటించారు. రవిశంకర్ శాస్త్రి, ఏక శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. చిలసౌ, అల.. వైకుంఠపురములో.. చిత్రాల తర్వాత సుశాంత్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఇచ్చట వాహనాలు నిలుపురాదు సినిమా పై ఆడియన్స్ లో ఆసక్తి ఏర్పడింది. ఈరోజు (ఆగష్టు 27) ఇచ్చట వాహనాలు నిలుపరాదు సినిమా రిలీజైంది. మరి.. ఈ సినిమా ఫలితం ఏంటో చెప్పాలంటే.. ముందుగా కథ చెప్పాల్సిందే.

కథ

అరుణ్ (సుశాంత్) ఒక ఆర్కిటెక్ట్. అతను పని చేసే ఆఫీస్ లోనే మీనాక్షి (మీనాక్షి చౌదరి) కూడా ఎంప్లాయ్ గా జాయిన్ అవుతుంది. అరుణ్‌, మీనాక్షి ప్రేమలోపడతారు. అయితే.. ఓరోజు మీనాక్షి, అన్నావదిన ఊరు వెళతారు. అప్పుడు మీనాక్షి.. అరుణ్ తో బైటకి వెళ్లాలి అనుకుంటుంది. అరుణ్ సడన్ గా మీనాక్షి ఇంటికి వచ్చి సర్ ఫ్రైజ్ చేయాలి అనుకుంటాడు. అరుణ్.. మీనాక్షి ఇంట్లోకి కాకుండా వేరే ఇంట్లోకి వెళతాడు. ఆ ఇంట్లో మర్డర్ జరుగుతుంది. అంతే.. అరుణ్ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. దాంతో ఆ ఏరియా జనం అరుణ్ వెంట పడతారు ? అరుణ్ వారి నుండి ఎలా తప్పించుకున్నాడు ? అసలు ఆ మర్డర్ చేసింది ఎవరు..? ఎందుకు చేశారు.? దీనిని అరుణ్ ఎలా బయటపెట్టాడు అనేదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్

సుశాంత్, మీనాక్షి చౌదరి జంట
వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం కామెడీ
కెమెరా వర్క్

మైనస్ పాయింట్స్

కథ, కథనం
బలమైన సన్నివేశాలు లేకపోవడం

విశ్లేషణ

ఈ సినిమాలో సుశాంత్ ప్రెష్ గా కనిపించాడు. పాత్రకు తగ్గట్టుగా నటించాడు. అయితే.. సుశాంత్ తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్లే కథలను ఎంచుకోవడంలోనే తడబడుతున్నాడు. అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. దాని నుంచి ఎలా బయటపడ్డాడు అనే పాయింట్ తో చాలా కథలు వచ్చాయి. అయినా ఈ కథను ఎంచుకున్నాడు. ఒకవేళ పాత కథనే ఎంచుకున్నప్పటికీ.. దీనిని కొత్తగా చెప్పే ప్రయత్నం చేయాలి. ఈ సినిమాలో అది మిస్ అయ్యింది. దర్శకుడు దర్శన్ ఈ కథను కొన్ని నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రాసినట్టు చెప్పారు.

అయితే.. ఇలాంటి కథలను చెప్పాలంటే.. వాట్ నెక్ట్స్..? తర్వాత ఏంటి..? అని ప్రేక్షకులు ఉత్కంఠతో చూసేలా పట్టుసడలని విధంగా స్ర్కీన్ ప్లే రాసుకోవాలి. కొత్త దర్శకుడు కావడంతో ఈ విషయంలో తడబడ్డాడు. అది తెర పై కనిపించింది. కథ ఎంతకు ముందుకు వెళ్లదు. అదే లోకేషన్ లో.. ఎంతసేపు అయినా.. కథ అక్కడే ఉండడంతో.. ప్రేక్షకులకి ఎప్పుడు ముందుకు వెళుతుందిరా బాబు అనిపిస్తుంటుంది. ప్రియదర్శి ఎమోషనల్ క్యారెక్టర్ చేశాడు. ఇక ఉన్నంతలో వెన్నెల కిషోర్ నవ్వించాడు. సునీల్ తో నవ్వించాలని ప్రయత్నించారు కానీ.. అది అంతగా వర్కవుట్ కాలేదు. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. సరదగా కాలక్షేపం చేద్దాం అనుకునేవాళ్లు ఈ సినిమా చూడచ్చు. అంతే తప్పా.. కొత్తదనం కోసం..ఇంకేదో ఆశించి థియేటర్ కి వెళితే మాత్రం నిరాశే.

రేటింగ్ – 2/5

Post Comment