Ganesh : నేను స్టూడెంట్ ను సర్.. ట్రైలర్ రివ్యూ

బెల్లంకొండ సురేష్‌ రెండో కొడుకు గణేష్‌ హీరోగా రూపొందిన రెండో సినిమా ”నేను స్టూడెంట్ ను సర్”. రాఖి ఉప్పలపాటి దర్శకత్వం వహించాడు. నాంది ఫేమ్ సతీష్‌ కుమార్ నిర్మించాడు. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ అయినప్పుడే చాలామంది ఇంట్రెస్టింగ్ గా ఉందనే కమెంట్స్ చేశారు. టీజర్ టైమ్ లో తేడాగా ఉందేంటీ అనుకున్నారు. బట్ ట్రైలర్ తో మాత్రం సమ్ థింగ్ న్యూ అనిపించేశారు.


9 నెలలు కష్టపడితే కానీ తను కోరుకున్న ఫోన్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉండే ఓ సాధారణ మధ్య తరగతి కుర్రాడు.. కాలేజ్ లో చదువుతుంటాడు. తనకో లవర్ కూడా ఉంటుంది. అంతా బావుంది అనుకుంటోన్న టైమ్ లో ఓపెద్ద ప్రాబ్లమ్ లో ఇరికించబడతాడు. ఇక అప్పటి నుంచి మనోడి లైఫ్ లో పోలీస్ లు, రౌడీలు, పొలిటీషియన్స్ ఎంటర్ అవుతారు. అంత చిన్న కుర్రాడు ఇంతమందిని ఫేస్ చేయలేడు కాబట్టి.పారిపోతుంటాడు. కానీ ఎన్నాళ్లని.. దానికో పరిష్కారం కావాలి కదా.. అదే సినిమా.

అయితే అతను ఇరుక్కున్న సమస్య ఏంటనే సస్పెన్స్ ను మెయిన్టేన్ చేస్తూ ట్రైలర్ ను మాత్రం బాగా కట్ చేశారనే చెప్పాలి.మామూలుగా ఇలాంటివి కంటెంట్ బేస్డ్ సినిమాలుగా వస్తాయి. దీనికి కాస్త మిడిల్ క్లాస్, లవ్ స్టోరీ, కాలేజ్ క్యాంపస్ కూడా యాడ్ చేసి ఇంకాస్త జాగ్రత్తగా స్క్రీన్ ప్లే రాసుకుంటే మంచి క్రైమ్ థ్రిల్లర్ అవుతుంది. ఈ సినిమా కోసం దర్శకుడు రాఖీ అదే చేశాడేమో అనిపిస్తోంది. ట్రైలర్ మాత్రం చాలా ఇంప్రెసివ్ గా ఉందనే చెప్పాలి.


గణేష్‌ మొదటి సినిమా స్వాతిముత్యంతో బాగా ఆకట్టుకున్నాడు. తన బలాలు, బలహీనతలు తెలిసి కథలు ఎంచుకుంటున్నాడా అనిపిస్తోంది.
ఇక నాందితో మెప్పించిన నిర్మాతలు మరోసారి సీరియస్ సబ్జెక్ట్ నే ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. మొత్తంగా జూన్ 2న విడుదల కాబోతోన్న ఈ చిత్రంపై ట్రైలర్ మాత్రం ఆసక్తి పెంచుతుందనే చెప్పాలి.

Related Posts