Latest

హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ..?

హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అడిషనల్ డిఐజీ ఐపీఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సోమవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనూహ్యంగా వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కు అప్లై చేయడంతో ముందు అంతా అవాక్కయ్యారు. కానీ ఇది కెసీఆర్ వేసిన స్కెచ్ లా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గత తొమ్మిదేళ్లుగా తెలంగాణ గురుకులాల కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఆయన హయాంలో ఆ పాఠశాలలు, కాలేజ్ లు అద్భుతమైన ప్రగతిని సాధించాయి. అతను కోరుకుంటే రిటైర్ అయ్యేంత వరకూ కార్యదర్శిగా ఉండే అవకాశం ఉంది. కానీ సడెన్ గా వీఆర్ఎస్ కు అప్లై చేయడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ పథకం వేరే ఉందనేది కొత్తవార్త.
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎస్సీ జనాభా 60వేలకు పైగానే ఉంది. వీరిలో మెజారిటీ ప్రవీణ్ కుమార్ కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు టిఆర్ఎస్ సంప్రదాయ ఓటర్లున్నారు. మరోవైపు ప్రవీణ్ కుమార్ కు స్వేరోస్ అనే సొంత సైన్యం ప్రచారంలో ‘ఉచితం’గా సాయం చేస్తుంది. ఇవన్నీ లెక్కలు వేసుకునే ప్రవీణ్ కుమార్ తో వీఆర్ఎస్ కు అప్లై చేయించాడు కెసీఆర్ అంటున్నారు. మరి ఇదే నిజమైతే ఇప్పటి వరకూ హుజూరాబాద్ లో నా గెలుపును ఎవరూ ఆపలేరు అని భావిస్తోన్న బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ పై ఇది మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి.

Post Comment