ఎంత తప్పు చేసారు అనిల్ గారూ..?

ఒక సినిమాకు ప్రధానంగా కావాల్సింది ఏంటి అంటే ఎవరైనా ముందుగా చెప్పేది కథ గురించే. కొత్తదో పాతదో ఏదో ఒకటి అసలు కథైతే ఉండాల్సిందే కదా.. అలాంటిది స్టోరీ లేకుండానే సెట్స్ పైకి వెళ్లడం అంటే బ్రేకులు లేవు అని తెలిసీ ఒక కార్ ను వేగంగా నడపడం లాంటిదే.

ఆలా చేసి ఇప్పుడు నిర్మాత అనిల్ సుంకర తీరిగ్గా బాధపడుతున్నాడు. పైగా కథ లేకుండానే సెట్స్ పైకి వెళ్ళాము అని ఆయనే చెప్పడంతో అంతా ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఆయనేమి కొత్త నిర్మాత కాదు. స్టార్స్ తో కూడా మూవీస్ చేసి ఉన్నాడు.

అలాంటి వ్యక్తి ఇలా బౌండ్ స్క్రిప్ట్ లేకుండానే షూటింగ్ కు వెళ్ళమని చెప్పడం ఇండస్ట్రీ లో కూడా దుమారం రేపుతోంది. ఎందుకంటే ఒక సీనియర్ ప్రొడ్యూసర్ గా కథ కరెక్ట్ గా లేనప్పుడు ప్రాజెక్ట్ ఆపొచ్చు. ప్రాపర్ స్టోరీ రెడీ అయ్యాకనే స్టార్ట్ చేయొచ్చు.

అవేవీ లేకుండా ఏకంగా ఎనభై కోట్ల బడ్జెట్ పెట్టడం అంటే మూర్ఖత్వమే అవుతుంది తప్ప ఇప్పుడు ఒప్పుకోవడం వాళ్ళ అతన్ని ఎవరూ గొప్ప అనరు. ఇంకా చెబితే ఇది ఆడియెన్స్ ను మోసం చేయడమే అవుతుంది. .


దీనివల్ల తాను మనీ లాస్ అయ్యాడని అనిల్ సుంకర అనుకోవచ్చు.. కానీ అసలే ప్లాప్స్ లో ఉన్న అఖిల్ కెరీర్ కు పెద్ద మైనస్ గా మారింది ఈ సినిమా. ఎంతో హార్డ్ వర్క్ తో దర్శకుడు చెప్పిందల్లా చేసి ఒళ్ళు హూనం చేసుకున్న అక్కినేని అఖిల్ కు ఇది పెద్ద దెబ్బగా మారింది.

అటు సురేందర్ రెడ్డి కూడా ఒక నిర్మాత తన్ను బ్లైండ్ గా నమ్మాడని అలా కానిచ్చాడు తప్ప తానూ ఒక మంచి కథ డెవెలప్ చేసుకోలేకపోయాడు. నిజానికి మధ్యలో కరోనా కూడా వచ్చింది. ఆ గ్యాప్ లో అయినా మంచి స్టోరీ ప్లాన్ చేసుకుని ఉండొచ్చు.

ఆ పని సురేందర్ రెడ్డి కూడా చేయలేకపోయాడు. ఈ మొత్తమ్ లో పూర్తిగా లాస్ అయింది మాత్రం అఖిల్. ఏదేమైనా ఓ సీనియర్ ప్రొడ్యూసర్ ఇలా బాధ్యతా రాహిత్యంగా ఉండటమే కాక ఆ విషయాన్నీ ఏదో ఘనకార్యంలా చెప్పడం ఆశ్చర్యమే.

Related Posts