కట్టిపడేసిన శాకుంతలం ట్రైలర్

శాకుంతల కథ గురించి గత రెండు తరాలకు పెద్దగా తెలియదు కానీ.. పుస్తకాలు చదివిన తరాలకు బాగా తెలుస్తుంది. మహాకవి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం కావ్యం తెలుగు సాహిత్యంతో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఒకటి. విశ్వామిత్రుడికి తపో భంగం కలిగించేందుకు వచ్చిన మేనక ఆ పనిలో విజయం సాధిస్తుంది. విశ్వామిత్రుడు తపస్సును వదిలి మేనకతో ప్రేమలో పడతాడు. అందుకు గుర్తుగా వారికి శాకుంతల జన్మిస్తుంది.

తను వచ్చిన పని ఐపోయింది కాబట్టి శాకుంతలను వద్దనుకుని మేనక వెళ్లిపోతుంది. మోసంగా భావించిన విశ్వామిత్రుడూ ఆమెను వదిలేస్తాడు. అనాథలా ఉన్న శకుంతలను దుర్వాస మహాముని( సినిమాలో మోహన్ బాబు నటించాడీ పాత్రలో) ఆశ్రమంలో అత్యంత గారాబంగా పెరుగుతుంది శకుంతల. ఆ రాజ్య రాజైన దుష్యంతుడు ఓ సారి అడవికి వేటకు వచ్చి..

శకుంతలను చూసి మోహించి గాంధర్వ వివాహం చేసుకుంటాడు. శకుంతల గర్భం దాలుస్తుంది. తర్వాత రాజ్యానికి రమ్మని దుష్యంతుడు వెళ్లిపోతాడు. అక్కడ రాజుగా తలమునకలై ఉంటాడు. కొన్నాళ్లకు నిండు చూలాలుగా రాజు వద్దకు వచ్చి తనను ఆయన భార్యగా పరిచయం చేసుకుంటుంది శకుంతల. కానీ దుష్యంతుడు అందుకు అంగీకరించడు. ఆమె ఎవరో తెలియదు అని అబద్ధం ఆడతాడు. నిండు సభలో అవమానిస్తాడు. ఆ అవమాన భారంతో తను మళ్లీ అడవికి వెళ్లి భరతుడు అనే కొడుకును కంటుంది. ఇతని పేరు మీదుగానే భరతఖండం అనే పేరు వచ్చిందని కూడా చెబుతాడు.

ఇది స్థూలంగా శకుంతల కథ.సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ చూస్తే కథను విడవకుండా దృశ్యకావ్యంలా చెప్పే ప్రయత్నం చేశాడు గుణశేఖర్ అని అర్థం అవుతుంది. ప్రతి ఫ్రేమ్ తీర్చిదిద్దినట్టుగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ అద్భుతమైన క్వాలిటీతో కనిపిస్తున్నాయి. అతని గత చిత్రం రుద్రమదేవి గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయనే కమెంట్స్ ను సీరియస్ గా తీసుకుని ఈ మూవీకి వర్క్ చేసినట్టు తెలుస్తోంది.

ఇక ఆర్టిస్టుల పరంగా సమంత .. శకుంతల పాత్రను ఎంత సీరియస్ గాతీసుకుందో ట్రైలర్ కే అర్థమైంది. దుర్వాసుడుగా మోహన్ బాబు ఇమేజ్ కు సరిగ్గా సరిపోయే పాత్ర పడింది. దుష్యంతుడుగా మళయాల నటుడు దేవ్ మోహన్ అందంగా ఉన్నాడు. ప్రకాష్‌ రాజ్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. మొత్తంగా శకుంతల ట్రైలర్ విజువల్ వండర్ లా ఉంది. సినిమా కూడా ఇలాగే ఉంటే ఖచ్చితంగా గుణశేఖర్ ఈ సారి బ్లాక్ బస్టర్ కొట్టినట్టే అనుకోవచ్చు. ఇక దిల్ రాజు విడుదల చేయబోతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.

Related Posts