అక్క‌డ హీరోలు.. ఇక్క‌డ విల‌న్లు

ఒకప్పుడు విలన్స్ అంటే.. ఆ పాత్ర‌లే పోషించేవాళ్లు కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోలు విల‌న్లు అవుతున్నారు.. విల‌న్లు హీరోలు అవుతున్నారు. పక్క భాషల్లో స్టార్ హీరోలుగా వెలిగిపోతున్న వాళ్లను తీసుకొచ్చి.. మన తెలుగు హీరోలకు ప్రతినాయకులుగా మార్చేస్తున్నారు దర్శకులు. అలా.. వేరే భాష‌లో హీరోగా చూసి మ‌న ద‌గ్గ‌ర విల‌న్ వేసాలు వేస్తుంది ఎవ‌రో ఇప్పుడు చూద్దాం.

కన్నడంలో దునియా విజ‌య్ కు యాక్ష‌న్ హీరోగా మంచి గుర్తింపు ఉంది. న‌టుడుగానే కాకుండా.. ద‌ర్శ‌కుడిగా కాకుండా మంచి పాపుల‌రిటీ ఉంది. ఇప్పుడు దునియా విజ‌య్ బాల‌య్య‌, గోపీచంద్ మూవీలో విల‌న్ గా న‌టిస్తుండ‌డం విశేషం. విజయ్ సేతుపతి. ఈయన తమిళంలో స్టార్ హీరో అయ్యుండి కూడా కారెక్టర్ నచ్చితే చాలు విలన్‌గా మారిపోతున్నాడు. ఇప్పటికే తమిళంలో పేట, మాస్టర్ లాంటి సినిమాలలో విలన్‌గా నటించారు. తెలుగులో ఉప్పెన సినిమాలో విల‌న్ గా న‌టించి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి డేట్స్ కావాలంటే.. కనీసం రెండు మూడేళ్లు ఆగాల్సిన పరిస్థితి ఉంది.

ఇక సుదీప్ కి క‌న్న‌డ‌లో ఎంత పాపులారిటీ ఉందో అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న హీరో అయిన‌ప్ప‌టికీ.. పక్క భాషల్లో ఏ మాత్రం ఇగోలు లేకుండా విలన్ వేషాలు వేస్తున్నాడు. తెలుగులో ఆయన చేసిన ఈగ సినిమాను ఎవరూ అంత ఈజీగా మరిచిపోలేరు. మరో వైపు విజయ్ పులి.. సల్మాన్ దబాంగ్ 3 సినిమాలలో కూడా ఈయనే విలన్. కన్నడలో స్టార్ హీరో అయినప్ప‌టికీ.. కూడా మిగిలిన భాషల�