రెండో పెళ్లికి సుమంత్ రెడీ..
Latest Movies Social Media Tollywood

రెండో పెళ్లికి సుమంత్ రెడీ..

అక్కినేని హీరో సుమంత్ రెండో పెళ్లికి రెడీ అవుతున్నాడు.. త్వరలోనే ఆయన మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.. అక్కినేని కుటుంబానికి సమీప బంధువు, నాగార్జునకి బాగా తెలిసిన వారి అమ్మాయిని సుమంత్ మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధం అవుతున్నాడు..

ఈ పెళ్లికి సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో పెళ్లి పత్రిక కూడా షేర్ అవుతోంది.. దీంతో, ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు.. సుమంత్ కి కాబోయే భార్య పేరు పవిత్ర.. అక్కినేని కుటుంబానికి సమీప బంధువని సమాచారం.. ఇప్పటికే ఆమెతో నాగార్జున, సుమంత్ తో పాటు అందరికీ బాగా పరిచయం ఉందట. ఇటు, సుమంత్ కి కూడా ఆ అమ్మాయి ముందే తెలుసని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.. ఈ పెళ్లికి ఇరువైపు పెద్దలు అంగీకరించడంతో వెంటనే వెడ్డింగ్ కార్డ్ ప్రింట్ అయింది.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

సుమంత్ కాబోయే భార్యకి ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయట.. ఆర్ధికంగా బాగా రిచ్ అని తెలుస్తోంది.. మరోవైపు, సుమంత్ కుటుంబానికి సైతం ఆస్తులు బాగానే ఉన్నాయని చెబుతున్నాయి సినీ వర్గాలు.. ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తోంది.. ఇది ముగియగానే మ్యారేజ్ జరగనుందట..

గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సూపర్ డూపర్ హిట్ మూవీ తొలి ప్రేమ మూవీ హీరోయిన్ కీర్తి రెడ్డితో పెళ్లి చేసుకున్నాడు సుమంత్.. ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో విడిపోయారు.. దాదాపు దశాబ్దం తర్వాత మరోసారి సుమంత్ పెళ్లికి రెడీ అవుతున్నాడు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తోన్న వెడ్డింగ్ కార్డ్ లో పెళ్లి డేట్ లేకుండా జాగ్రత్త పడ్డారు.. అయితే త్వరలోనే ముహూర్తం ఫిక్స్ చేసి మీడియాకి సమాచారం ఇవ్వనున్నారట.. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా ‘అనగనగా ఒక రౌడీ’లో నటిస్తున్నారు.

Post Comment