హీరో నిఖిల్ యాక్ష‌న్ స్పై మూవీ అనౌన్స్‌మెంట్‌
Latest Movies Tollywood

హీరో నిఖిల్ యాక్ష‌న్ స్పై మూవీ అనౌన్స్‌మెంట్‌

75వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ 19వ చిత్రం అనౌన్స్‌మెంట్ వెలువ‌డింది. హీరో నిఖిల్ తొలిసారి ఓ స్పై మూవీ చేస్తున్నారు. గూఢ‌చారి, ఎవ‌రు, హిట్ వంటి చిత్రాల‌తో అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్న ప్ర‌ముఖ ఎడిట‌ర్ గ్యారీ బి.హెచ్ ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మార‌తుండ‌టం విశేషం.

ఎం.జి. అమర్‌నాథ్ పిక్చ‌ర్స్‌, రెడ్ సినిమాస్ పతాకాల‌పై కె.రాజ‌శేఖ‌ర్ రెడ్డి, చ‌ర‌ణ్‌తేజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌న దేశ జెండా దాని ప‌క్క‌నే స‌రిహ‌ద్దులోని సైనికులతో ఉన్న అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. అలాగే ఈ పోస్ట‌ర్‌లో ప్ర‌సిద్ధి చెందిన కొన్ని విదేశీ ప్రాంతాలు కూడా క‌నిపిస్తున్నాయి. వీట‌న్నంటినీ చూస్తుంటే భారీ స్పాన్‌తో ఈ సినిమా రూపొంద‌నున్నట్లు అర్థమ‌వుతుంది. స్వాతంత్య్ర దినోత్స‌వానికి ప‌క్కాగా స‌రిపోయే పోస్ట‌ర్ ఇది.

ఇంకా టైటిల్ పెట్ట‌ని ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో యాక్ష‌న్ ప్యాక్డ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందించ‌నున్నారు. వైవిధ్య‌మైన సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించే హీరో నిఖిల్ ఈ చిత్రంలో తొలిసారి గూఢ‌చారి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. భారీ బడ్జెట్‌తో రూపొంద‌నున్న‌న ఈ ఎంట‌ర్‌టైన‌ర్ కోసం ప్ర‌ముఖ సాంకేతిక నిపుణులు ప‌నిచేయ‌బోతున్నారు. పోస్ట‌ర్‌పై ‘ది హంట్ బిగిన్స్ సూన్’ అనే లైన్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలియజేస్తోంది.

నటీనటులు:
నిఖిల్ సిద్ధార్థ్

Post Comment