ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా ‘హనుమాన్‘

సంక్రాంతి సీజన్ అంటేనే పెద్ద హీరోల సినిమాలు గుర్తుకొస్తాయి. సంక్రాంతి బరిలో అగ్ర కథానాయకుల చిత్రాలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. తెలుగు సినిమా అనాది నుంచి వస్తోన్న ఆచారమే ఇది. గతంలో సంక్రాంతి బరిలో తమ చిత్రాలను పోటాపోటీగా విడుదల చేసేవారు ఎన్టీఆర్, ఏఎన్నార్. ఆ తర్వాతి తరంలోని వారు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.

అయితే.. ఈసారి సంక్రాంతి కాస్త భిన్నంగా సాగిందని చెప్పొచ్చు. ఈ సంక్రాంతి బరిలో అగ్ర కథానాయకులు నటించిన సినిమాలొచ్చినా.. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ‘హనుమాన్‘ అఖండ విజయాన్ని సాధించింది. కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. మొత్తంమీద.. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగానే కలెక్షన్లను కొల్లగొట్టింది. అంటే.. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమా కూడా సంక్రాంతి బరిలో విడుదలై ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించలేదు. అదే విషయాన్ని తెలుపుతూ 92 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో సంక్రాంతికి విడుదలై ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం తమదేనంటూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్.

Related Posts