జిన్నా మూవీ రివ్యూ….

రివ్యూ :- జిన్నా
తారాగణం :- మంచు విష్ణు, సన్నిలియోన్, పాయల్ రాజ్ పుత్, చమ్మక్ చంద్ర, వెన్నెల కిశోర్, అన్నపూర్ణ, రఘుబాబు తదితరులు
ఎడిటిగ్ :- చోటా కే ప్రసాద్
సినిమాటోగ్రఫీ :- చోటా కే నాయుడు
సంగీతం :- అనూప్ రూబెన్స్
నిర్మాత :- మోహన్ బాబు
దర్శకత్వం :- ఇషాన్ సూర్య

వరుసగా సినిమాలు చేస్తున్నా.. ఎప్పుడో కానీ హిట్ అనే మాట చూడడు మంచు విష్ణు. అయితే తను కామెడీ కథలు ట్రై చేసిన ప్రతిసారీ హిట్ సంగతేమో కానీ.. ఫ్లాప్ అయితే చూడలేదు. అందుకే కొన్ని ఫ్లాపుల తర్వాత ఇప్పుడు జిన్నా అంటూ వచ్చాడు. పైగా సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ వంటి బ్యూటీస్ కూడా ఉండటం, ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో జిన్నాపై కొంత అంచనాలు పెరిగాయి. మరి వాటిని ఈ మూవీ ఏ మేరకు అందుకుంది అనేది చూద్దాం.

కథ :-
జిన్నా( విష్ణు) తిరుపతి దగ్గర్లోని రంగంపేట అనే ఊరిలో ఉంటాడు. పెద్దగా చదువుకోని అతను ఓ టెంట్ హౌస్ రన్ చేస్తుంటాడు. ఎప్పటికైనా ఆ ఊరికి సర్పంచ్ కావాలనే ప్రయత్నాల్లో ఉంటూ ఒక వ్యక్తి దగ్గర అప్పులు చేస్తాడు. అతని టెంట్ హౌస్ తీసుకుని ఎవరు పెళ్లి చేసుకున్నా పెళ్లి కొడుకుకు ఏదో ఒకటి అవుతుంది. అయినా తన చిన్నప్పటి ఫ్రెండ్స్ తో కలిసి రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో చిన్నప్పుడు తమతో కలిసి చదువుకున్న ఫ్రెండ్ రేణుక(సన్నిలియోన్) అనే అమ్మాయి అమెరికా నుంచి చాలాయేళ్ల తర్వాత సొంత ఊరికి వస్తుంది. చిన్నప్పటి నుంచీ మూగ, చెవిటి కూడా అయిన రేణుక వచ్చీ రాగానే విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతూ జిన్నాను పెళ్లి చేసుకోవడమే లక్ష్యంగా ఉంటుంది. కానీ జిన్నా మరో అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ తన అప్పులు తీరాలంటే రేణుకను పెళ్లి చేసుకోవడమే మార్గం