Ms.shetty Mr.polishetty : ధనుష్ గొంతులో ఫంకీగా అనుష్క మూవీ సాంగ్

స్వీటీ బ్యూటీ అనుష్క శెట్టి, టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటిస్తోన్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. మహేష్‌ బాబు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది.

రధన్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీ నుంచి ప్యాన్ ఇండియన్ సూపర్ స్టార్ ధనుష్ పాడిన హతవిధీ పాటను విడుదల చేశారు.రామ జోగయ్యశాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతం చాలా క్యాచీ ట్యూన్ తో వినగానే ఆకట్టుకునేలా ఉంది. సాహిత్యంలోని పదాలు కూడా సాధారణంగా అనిపిస్తూనే అసాధారణమైన అర్థాన్ని ఇస్తున్నాయి.

తన ప్రేమించిన అమ్మాయి.. మరో వ్యక్తితో చనువుగా ఉండటం సహించలేని ఓ కుర్రాడి బాధగా ఈ పాట కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే రామజోగయ్య శాస్త్రి సాహిత్యం కూడా “ ‘హతవిధీ ఏందిదీ.. ఊహలో లేనిదీ.. బుల్లిచీమ బతుకుపై బుల్డోజరైనదీ..“మొదలవుతుంది. ” చిట పటాసు ఫాదరు.. కట్ కటీఫు లవ్వరు.. నట్టనడుమ జిందగీ.. అప్పడమైనదీ.. వాటే డామేజీ.. చెవిలో క్యాబేజీ ఎట్టా కుదిరిద్ది టేకిట్ ఈజీ.. ” అంటూ ఫంకీ వర్డ్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా ఉంది.


హార్డ్ బ్రేక్ అయిన యూత్ కు ఓ ఆంథెమ్ లా కనిపిస్తోన్న ఈ పాట ధనుష్ గొంతులో అందంగా కుదిరింది. అప్పట్లో అతను పాడిన వై దిస్ కొలవెరి రేంజ్ లో కనిపిస్తోంది. కొంతకాలం పాటు అన్ని ఆడియో ప్లాట్ ఫామ్స్ లో అదరగొట్టేలా ఉందనే చెప్పాలి.

ఇక ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా, అనుష్క చెఫ్‌గా చూపించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్‌ బాబు డైరెక్ట్ చేసిన చిత్రం ఇది. ఇక తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో విడుదల కాబోతోందీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.

Related Posts