హుజూరాబాద్‌ కోసం కేసీఆర్ మరో పథకం ఈటల మైండ్‌ బ్లాంక్‌..!!
Latest

హుజూరాబాద్‌ కోసం కేసీఆర్ మరో పథకం ఈటల మైండ్‌ బ్లాంక్‌..!!

ఎవరు ఔనన్నా… ఎవరు కాదన్నా…. తెలంగాణ రాజకీయాలన్నీ ప్రస్తుతం హుజూరాబాద్‌ కేంద్రంగా సాగుతున్నాయి.. మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటలను ఆయన సొంత అడ్డాలో ఓడించాలని స్కెచ్‌ గీస్తున్నారు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. దీనికోసం ఆయన తన ఎత్తుగడలను అన్నింటిని ప్రయోగిస్తున్నారు.. ఈటల అనుచరులకు గాలం వేస‌్తున్నారు. ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నారు.. వీటితోపాటు కొత్త పథకాలు ప్రారంభిస్తున్నారు..

ఇప్పటికే దళిత బంధు పథకాన్ని పైలట్‌ పథకంగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రారంభించడానికి కేసీఆర్‌ వ్యూహం రచించారు.. ఎంపిక చేసిన దళిత కుటుంబానికి పది లక్షల రూపాయల అందిస్తారు.. తెలంగాణ వ్యాప్తంగా ఈ పథకాన్ని తర్వాత విస్తరించనున్నారు.. ఈ ఏడాదికి ఈ ఒక్క పథకం కోసం టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఏకంగా 1500 కోట్ల రూపాయలు కేటాయించనుంది.. ఈ పథకం హుజూరాబాద్‌ నుండి ప్రారంభం కానుండడంతో ఈటల వర్గం ఉలిక్కిపడింది.. నియోజకవర్గంలోని దళిత ఓట్‌ బ్యాంక్‌ తనకి వ్యతిరేకంగా పడుతుందనే భావనలో ఉంది.. ఇది తన విజయావకాశాలపై పడుతుందని భావనలో ఉందట ఈటల వర్గం..

దళిత బంధు పథకం షాక్‌ నుండి తేరుకోకుండానే తాజాగా హుజూరాబాద్‌ నియోజకవర్గం సాక్షిగా మరో స్కీమ్‌ కి తెరలేపింది అధికార టీఆర్‌ఎస్‌.. ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగుల విరమణ వయసును… సింగరేణి కార్మికులకు కూడా విస్తరించాలని యోచిస్తోందట కేసీఆర్‌ సర్కార్‌.. ఈ పథకాన్ని నేడో రేపో అమలు చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట కేసీఆర్‌..

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో సింగరేణి కార్మికుల కుటుంబాల సంఖ్య పెద్ద ఎత్తున ఉంది.. ఉద్యోగ విరమణ వయసు పథకం సింగరేణిలోనూ విస్తరిస్తే… ఈ ఓట్‌ బ్యాంక్‌ భారీగా చీలిపోతుందని డైలమాలో పడిందట ఈటల వర్గం..

కేసీఆర్‌ దూకుడు చూసి ఈటల టీమ్‌ లో టెన్షన్‌ మొదలయిందని చెబుతున్నారు.. కొత్త కొత్త పథకాలు, ఇటు ఇతర పార్టీల నుండి చేరికలతో ఈటల చుట్టూ భారీగా స్కెచ్‌ గీస్తోంది గులాబీ అధిష్టానం.. మరి, కేసీఆర్‌ వ్యూహానికి ఈటల ఎలా కౌంటర్‌ ఇస్తారో చూడాలి..

Post Comment