పుష్ప ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్.?
Latest Movies Tollywood

పుష్ప ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్.?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది. ఈ భారీ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ మూవీ టీజ‌ర్ అండ్ సాంగ్స్ కు ట్రెమండ‌స్ రెస్సాన్స్ రావ‌డంతో ట్రైల‌ర్ ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని క్యూరియాసిటీ పెరుగుతోంది.

తాజా అప్ డేట్ ఏంటంటే.. ఈ చిత్రం నుండి ఇక ట్రైలర్ ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వ‌హించాలి అనుకుంటున్నార‌ని తెలిసింది. ఇంత‌కీ ఎప్పుడు పుష్ప ట్రైల‌ర్ రిలీజ్ అంటే.. డిసెంబ‌ర్ 2న అని టాక్ వినిపిస్తోంది. అయితే.. రిలీజ్ డేట్ పై అఫిసియ‌ల్ గాఎలాంటి అప్ డేట్ బ‌య‌ట‌కు రాలేదు. దీంతో ప్ర‌చారంలో ఉన్న‌ట్టుగా డిసెంబ‌ర్ 2న పుష్ప ట్రైల‌ర్ రిలీజ్ చేస్తారా..? లేక వేరే డేట్ లో రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సివుంది.

Post Comment