Latest

మాటలతో పనవుతుందా ఈటలా ..?

మొన్నటి వరకూ అధికార ప్రభుత్వంలో మంత్రిగా ఉండి.. అనూహ్యంగా మాజీ అయ్యాడు. కొద్ది రోజుల్లోనే కమలం గూటికి చేరాడు ఈటల రాజేందర్. కెసీఆర్ తో ఉద్యమ కాలం నుంచి సన్నిహితుడుగా ఉన్నాడు ఈటల. అలాంటి వ్యక్తిని అవినీత ఆరోపణల నేపథ్యంలో ఇప్పటి వరకూ ఏ అధికార పార్టీ చేయనంత హడావిడీతో పాటు వేగంగా విచారణ జరిపించాడు.దీనికి నొచ్చుకున్న ఈటల రాజీనామా చేసి బిజెపిలో చేరాడు.

ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలుపుకోసం నానా తంటాలు పడుతున్నాడు. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే పాదయాత్రం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీపై, ఆ పార్టీ నేతలపై మాటల ఈటలు దించుతున్నాడు. కానీ కెసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను మాత్రం ఖచ్చితంగా ఎత్తి చూపలేకపోతున్నాడు. ఎంతసేపూ తనను తాను రక్షించుకునే ధోరణిలోనే మాట్లాడుతున్నాడు కానీ.. అసలు సమస్యలపై ఫోకస్ చేయడం లేదు.

కేవలం అధికార ప్రభుత్వాన్ని తిట్టినంత మాత్రాన తనకు ఓట్లు పడతాయనే భ్రమలో ఉన్నాడేమో ఈటల. కానీ ఉట్టి మాటలు కట్టిపెట్టి ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపితేనే కాస్త ప్రయోజనం కనిపిస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

Post Comment