దృశ్యం 2 – రివ్యూ
Latest Movies Reviews Tollywood

దృశ్యం 2 – రివ్యూ

వెంక‌టేష్‌, మీనా జంట‌గా న‌టించిన తాజా చిత్రం దృశ్యం 2. ఇది దృశ్యం చిత్రానికి సీక్వెల్ గా రూపొందింది. మ‌ల‌యాళంలో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ తెలుగులోనే తెర‌కెక్కించారు. డి. సురేష్‌ బాబు, అంటోనీ పెరంబవూర్, రాజ్‌కుమార్ సేతుపతి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దృశ్యం స‌క్స‌స్ కావ‌డం.. ఈ మూవీకి సీక్వెల్ గా రూపొందిన దృశ్యం 2 కూడా మ‌ల‌యాళంలో విజ‌యం సాధించ‌డంతో తెలుగులో కూడా అదే స్థాయిలో స‌క్స‌స్ సాధిస్తుంద‌నే టాక్ ఉంది. థియేట‌ర్లో రిలీజ్ అవుతుంద‌నుకున్న దృశ్యం 2 చిత్రం డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయ్యింది. ఇంత‌కీ.. దృశ్యం 2 చిత్రం మెప్పించిందా..? లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

 

క‌థ –

దృశ్యం చిత్రం మొదటి భాగం ఎక్క‌డైతే ముగిసిందో అక్క‌డ నుంచే కథ మొదలవుతుంది. రాంబాబు (వెంకటేష్), వరుణ్ (నదియా కొడుకు) మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ కింద పూడ్చి పెట్టేసి, ఆ హత్య కేసులో ఎలాంటి క్లూ లేకుండా చేస్తాడు. ఇది జ‌రిగి ఆరేళ్లు అవుతుంది. అయిన‌ప్ప‌టికీ.. వ‌రుణ్ ని ఎవ‌రు చంపారో ఎవ‌రికీ తెలియ‌దు. వరుణ్ తల్లిదండ్రులు తమ కొడుకును ఎవరు చంపారో తెలియక చస్తూ బతుకుంటారు. అయితే.. ఈ కేసులో రాంబాబుకు వ్యతిరేకంగా మరిన్ని సాక్ష్యాలను సేకరిస్తారు. అతనిని అరెస్టు చేయడానికి పోలీస్ ఆఫీసర్ (సంపత్)ని నియమిస్తారు. ఇక సినిమాల మీద మ‌క్కువ‌తో రాంబాబు ఓ సినిమా తీయాల‌నుకుంటుంటాడు. పోలీసులు.. సినిమా తీయాల‌నుకునే రాంబాబుకు అస‌లు సినిమా చూపించాలి అనుకుంటారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో రాంబాబు తన కుటుంబాన్ని మరోసారి ఎలా రక్షించుకుంటాడు ? ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడతాడు? అనేది తెలియాలంటే.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్

వెంక‌టేష్, మీనా న‌ట‌న‌
స్ర్కీన్ ప్లే
ట్విస్టులు

మైన‌స్ పాయింట్స్

అక్క‌డ‌క్క‌డా స్లోగా ఉండ‌డం

విశ్లేష‌ణ –

వెంకటేష్ ఫ‌స్ట్ పార్ట్ లో ఎలా అయితే.. క‌నిపించాడో ఈ సినిమాలో కూడా అలాగే క‌నిపించాడు. క‌ళ్ల‌తోనే అద్భుతంగా ఎమోష‌న్స్ ప‌లికించి త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేశాడు. ఇక మీనా కూడా స‌పోర్టింగ్ రోల్ ను పర్ ఫెక్ట్ అనేలా చేసింది. వీరిద్ద‌రి జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది. అలాగే నరేష్, నదియా కూడా మరోసారి పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా బాగా నటించారు. ఇక‌ రఫ్ అండ్ ట‌ఫ్ పోలీస్ గా సంప‌త్ రాజ్ ఆకట్టుకున్నాడు. అతని బాడీ లాంగ్వేజ్ మరియు ఎక్స్‌ప్రెషన్స్ ఇన్వెస్టిగేటివ్ మూవీకి త‌గ్గ‌ట్టుగా బాగా సెట్ అయ్యింది. సత్యం రాజేష్‌కి పెద్ద పాత్ర వచ్చింది. అతడు కూడా బాగా ఆకట్టుకున్నాడు.

ట్విస్టులు బాగున్నాయి. వాటిని రివీల్ చేసిన విధానం కూడా ఆక‌ట్టుకునేలా ఉంది. అయితే.. క‌థ‌నం విష‌యంలో ఇంకా జాగ్ర‌త్త తీసుకుని.. క‌థ‌ను ఫాస్ట్ గా వెళ్లేలా చేసుంటే బాగుండేది. అక్క‌డ‌క్క‌డా క‌థ‌ ఇంకా ముందుకు వెళ్ల‌డం లేదు ఏంటి అనిపిస్తుంటుంది. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్ని కీలక ఎమోషనల్ సీన్స్ దగ్గర తాను ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఎఫెక్టీవ్ గా కూడా ఉంది. దృశ్యం సీక్వెల్ కాబ‌ట్టి అంచ‌నాలు ఉన్న‌ప్ప‌టికీ.. ఆక‌ట్టుకుంది. అయితే.. బోర్ లేకుండా స్ర్కీన్ ప్లే పై కాస్త క‌స‌ర‌త్తు చేసుంటే బాగుండేది.

రేటింగ్ 3/5

Post Comment