Prabhas : అలా చేస్తే ఆదిపురుష్ కు నష్టమే

ఒక సినిమాకు మంచి క్రేజ్ ఉన్నప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్ ఇస్తే రెండూ డైల్యూట్ అయిపోతాయి. ప్రస్తుతం ప్రభాస్ మూవీ ఆదిపురుష్ కు సంబంధించి ఇదే వినిపిస్తోంది. ఆదిపురుష్ కు ఇప్పుడిప్పుడే క్రేజ్ పెరుగుతోంది. ట్రైలర్ తర్వాత మూవీ టోన్ మారిపోయింది. అంతకుముందు ఓ రేంజ్ లో నెగెటివ్ గా మాట్లాడుకున్నారు. బట్ ట్రైలర్ తర్వాత సీన్ మారింది. చాలా బావుంది అంటున్నారు.

దీనికి తోడు ప్రమోషన్స్ లో కూడా దూకుడు పెంచారు. పాటల విషయంలో అయితే ఇప్పటి వరకూ దేశంలోనే ఎవరూ చేయని విధంగా ఈ శుక్రవారం ఒక పాట విడుదల చేశారు. ఇక వచ్చే నెల 6న తిరుపతిలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. జూన్ 16న విడుదల కాబోతోన్న ఆదిపురుష్ పై అన్ని రకాలుగా అంచనాలు పెంచే ప్రయత్నాలు చేస్తోంది మూవీ టీమ్. ఈ సందర్భంలో ఈ క్రేజ్ ను డైల్యూట్ చేసే వార్త ఒకటి హల్చల్ చేస్తోంది.


ఎంత కాదనుకున్నా.. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ లో ఆదిపురుష్‌ కంటే సలార్ పైనే భారీ అంచనాలున్నాయి. అందుకు కారణం ఇది ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావడం.. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుండటం. అంటే వారు ఆదిపురుష్ ను ఆదరించినా.. సలార్ కే ఎక్కువ ఓటు వేస్తారు అనేది నిజం. మరి అలాంటి మూవీ టీజర్ ను ఆదిపురుష్ మూవీతో పాటు విడుదల చేస్తే ఎలా ఉంటుంది..? ప్రస్తుతం ఇదే వినిపిస్తోంది.

ఆదిపురుష్ విడుదలవుతోన్న జూన్ 16న అన్ని థియేటర్స్ లో సలార్ టీజర్ ను ప్రదర్శిస్తారు అంటున్నారు. ఇలా చేస్తే ఆదిపురుష్‌ పై ఉన్న క్రేజ్ తగ్గుతుంది. ఒకవేళ ఫస్ట్ డే రికార్డ్స్ వచ్చినా.. అది సలార్ అకౌంట్ లోకి సగం వెళుతుంది. అందుకే ఇది మంచి నిర్ణయం కాదు అనేది విశ్లేషకుల అంచనా.. మరి ఇది నిజమా కాదా అనేది ఇప్పుడే చెప్పలేం కానీ..నిజమే అయితే ఖచ్చితంగా బ్యాడ్ డెసిషన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు.

Related Posts