ప్యాన్ ఇండియన్ సినిమాల జోరు బాగా పెరిగింది. వరుసగా అందరు హీరోలు ప్యాన్ ఇండియన్ మూవీ అనేస్తున్నారు. ఈ లిస్ట్ లో కొందరు చిన్న హీరోలు కూడా ఉన్నారు. ఈ ట్రెండ్ ను మొదలుపెట్టిన ప్రభాస్ కూడా దూకుడు పెంచాడు. కంటిన్యూస్ మూవీస్ తో కలెక్షన్ల సునామీ సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే 2023 ప్యాన్ ఇండియన్ మార్కెట్ మాత్రం ప్రభాస్ దే అంటున్నారు చాలామంది. అందుకు లెక్కలు కూడా పక్కాగానే ఉన్నాయి. ఈ యేడాది పఠాన్ మూవీతో ప్యాన్ ఇండియన్ సినిమా మార్కెట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎవరు వచ్చినా.. హవా మాత్రం డార్లింగ్ దే ఉంటుందనేది ట్రేడ్ అంచనా. అందుకు కారణాలేంటో చూద్దాం..


షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీతో 2023లో ప్యాన్ ఇండియన్ మూవీ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే విడుదలైన ఈమూవీ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సంక్రాంతికి రావాల్సిన ప్రభాస్ ఆదిపురుష్‌ ను వాయిదా వేసినప్పుడు అంతా పఠాన్ తో పాటు వస్తుందనుకున్నారు. బట్ వాళ్లు జూన్ కు వెళ్లిపోయారు. సో.. ఈ యేడాది జూన్ లో ప్రభాస్ నుంచి ఈ సోషియో ఫాంటసీ మూవీ వస్తుంది. ఇప్పటి వరకూ వచ్చిన విమర్శలను తిప్పి కొట్టేలా ఈ సారి చాలా జాగ్రత్తగా ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ చేయిస్తున్నారు. అందుకే చాలా టైమ్ తీసుకుంటున్నారు.

ఇక పఠాన్ తర్వాత వస్తోన్న మరో ప్యాన్ ఇండియన్ మూవీ పొన్నియన్ సెల్వన్2. ఫస్ట్ పార్ట్ ఇతర భాషల్లో పెద్దగా వర్కవుట్ కాలేదు. సో.. ఈ సారి అంచనాలు కూడా తగ్గుతాయి అనే చెప్పొచ్చు. పుష్ప2 కూడా ఉంటుందనే వార్తలున్నా.. ఇంకా కన్ఫార్మ్ కాలేదు. ప్రధానంగా ఈ చిత్రాల గురించి మాట్లాడుతున్నా.. అసలైన ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా వచ్చేది సలార్. ఆదిపురుష్‌ తో వచ్చిన మూడు నెలల్లోనే సలార్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఇక ఈ రెండు చిత్రాలతో ఈ యేడాది ప్రభాస్ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్నాడు అనేది ట్రేడ్ టాక్. ఆదిపురుష్ లుక్ లో తేడా ఉన్నా.. కథలో బలం ఉంటుందనేది ఇప్పటికే చాలామంది చెబుతున్నారు. కంటెంట్ బావుండి..

ఇప్పుడు రిపేర్ చేస్తున్న గ్రాఫిక్స్ ఈ సారైనా బావుంటే ఆదిపురుష్‌ దేశం మొత్తం షేక్ చేస్తుంది. ఇక సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్. కెజీఎఫ్‌ తో కంట్రీ మొత్తం తన అభిమానులుగా చేసుకున్నాడు ప్రశాంత్. పైగా ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్. శ్రుతి హాసన్ ఫీమేల్ లీడ్ లో మళయాల సూపర్ స్టార్ పృథ్వీరాజ్ విలన్ గా నటిస్తోన్న ఈ చిత్రంపైనా భారీ అంచనాలున్నాయి. ప్యాన్ ఇండియన్ హీరో, డైరెక్టర్ కాంబోలో వస్తోన్న ఈ మూవీ గ్లోబల్ ఆడియన్స్ ను కూడా ఎంటర్టైన్ చేస్తుందంటున్నారు. సో.. ఎలా చూసినా.. ఎంతమంది హీరోలు వచ్చినా ప్యాన్ ఇండియన్ మార్కెట్ లో ఈ సారి ప్రభాస్ దే పై చేయి అవుతుందంటున్నారు.