డిజే టిల్లు.. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సితార బ్యానర్ నిర్మించిన సినిమా. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచిందీ చిత్రం. ఎవరూ ఊహించని రేంజ్ లో డిజే టిల్లు లోని అన్ని డైలాగ్స్ ఫేమస్ అయ్యాయి. ఇప్పటి వరకూ వచ్చిన సినిమాల్లోని తెలంగాణ స్లాంగ్ కు భిన్నంగా కంప్లీట్ దక్కన్ స్లాంగ్ లో సిద్ధు చెప్పిన డైలాగ్స్ కు చాలామంది ఫిదా అయ్యారు.

సినిమా క్లైమాక్స్ చూసినప్పుడే చాలామంది దీనికి సీక్వెల్ ఉంటుందనుకున్నారు. ఆ మేరకు సీక్వెల్ కాస్త ఆలస్యమైనా.. సీక్వెల్ ను అనౌన్స్ చేసింది టీమ్. టైటిల్ ను కూడా పార్ట్ 2 అని కాకుండా.. స్క్వేర్ అని పెట్టేశారు. అంటే ఈ సారి డబుల్ డోస్ ఇవ్వబోతున్నాం అని చెప్పకనే చెప్పారు. కానీ ఆ డోస్ ను కేవలం హీరోతో కాదు. హీరోయిన్ కూడా అందుకు సిద్ధంగా ఉంటే తప్ప ఆ డోస్ ఆడియన్స్ కు కిక్ ఇవ్వదు. ఈ విషయంలో మొదటే రాంగ్ స్టెప్ వేసింది మూవీ టీమ్. రెండు సార్లు మిస్ అయినా మూడో సారి కూడా అదే మిస్టేక్ రిపీట్ చేస్తున్నారు.


డిజే టిల్లులో హీరోయిన్ నేహాశెట్టి ఓ హైలెట్ అనే చెప్పాలి. తన గ్లామర్ సినిమాకు చాలా చాలా ప్లస్ అయింది. మళ్లీ ఆ గ్లామర మ్యాజిక్ ను రిపీట్ చేయడం కోసం అలాంటి బ్యూటీనే తీసుకోవాల్సి ఉంది. కానీ వీళ్లు మాత్రం మొదట శ్రీ లీలను అనుకున్నారు. తను నో చెప్పింది. తర్వాత అనుపమ పరమేశ్వరన్ ను సెలెక్ట్ చేసుకున్నారు. బట్ తనది హోమ్లీ ఇమేజ్.

ఆ ఇమేజ్ తో టిల్లుకు కిక్ ఇవ్వడం కష్టం. ఆ కారణంగానేనా లేక ఇంకేదైనా ఉందా అనేది చెప్పలేం లేటెస్ట్ గా తను సినిమా నుంచి తప్పుకుంది. నిజానికి గ్లామర్ షో కోసం తనను పట్టుపట్టడం వల్లే వెళ్లిపోయిందనేవారూ ఉన్నారు. ఇక ఆ ప్లేస్ ఓ ఇప్పుడు మళయాలీ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ ను తీసుకున్నారు. బట్ తను కూడా నేహాశెట్టితో కంపేర్ చేస్తే రాంగ్ చాయిస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. మడోన్నా గత సినిమాలు ఏవి చూసినా.. తనలో రాధిక పాత్రకు సరిపడే సెక్స్ అప్పీల్ కనిపించదు. సో.. ఈ డిజే టిల్లు స్క్వేర్ కు సరిపోయే గ్లామర్ ను కురిపించినా.. కనెక్ట్ కావడం కష్టం. మొత్తంగా డిజే టిల్లు హీరోయిన్ల విషయంలో తప్పుల మీద తప్పులు చేస్తున్నారనే చెప్పాలి.