దిల్ రాజుది డైవర్షన్ స్కెచ్ .. వారసుడు ను వదిలేసేందుకేనా..?

దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన వారసుడు సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా డిక్లేర్ అయింది. తమిళ్ లో మాత్రం హీరో ఇమేజ్ వల్ల కాస్త ఫర్వాలేదు అనిపించుకుంటోంది తప్ప.. సూపర్ హిట్ అని చెప్పడానికి లేదు అని అక్కడి క్రిటిక్స్ అంటున్నారు. ఓ రకంగా దిల్ రాజుకు ఇది ఊహించిన షాకే అని చెప్పాలి. కాకపోతే ఈ మూవీ రిలీజ్ కు ముందు వరకూ కాస్త న్యూస్ లో ఉండేలా చేయగలిగాడు. అయితే అతని లాస్ గురించిన వార్తలు మొదలు కాగానే సడెన్ గా మూడు సినిమాలు అనౌన్స్ చేసి ఆ మేటర్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అలాగని ఇవేవీ ఆషామాషీ మూవీస్ కాదు. ఒకటి ప్రశాంత్ నీల్ తో కూడా ఉంది. పైగా టైటిల్స్ తో సహా అనౌన్స్ చేశాడు. మరి ఇది స్కెచ్చా.. లేక నిజంగానే సెట్ చేశాడా..?


దిల్ రాజు.. కొన్నాళ్ల క్రితం వరకూ ఆయన బ్యానర్ అంటే ఓ బొమ్మరిల్లు అనుకున్నారు. ఎప్పుడైతే తెలుగులో ఆ నలుగురు అనే ట్యాగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చాలామంది దిల్ రాజులో కొత్త కోణాన్ని చూశారు. బట్ ఆయన మాత్రం అది తన వ్యాపారంగా భావించే విస్తరించుకుంటూ పోయారు. ఈ క్రమంలో ఈ ట్యాగ్ మిగతా వారికంటే ఎక్కువగా ఈయన్నే డామేజ్ చేసింది. ముఖ్యంగా ఈ సంక్రాంతికి వచ్చిన ఆయన వారసుడు సినిమా కొన్నాళ్ల క్రితం డబ్బింగ్ సినిమాలు వద్దని చెప్పిన ఆయన మాటలతోనే పోల్చి ఇండస్ట్రీలో కూడా చాలామంది వ్యతిరేకించారు. ఫైనల్ గా ఈ మూవీ వచ్చింది. ప్రస్తుతం థియేటర్స్ లో ఉంది. అయితే వారసుడు రిలీజ్ విషయంలో దిల్ రాజు ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయింది అనే వారూ ఉన్నారు.

అవి ఎలా ఉన్నా.. తను ఎంతో ఫైట్ చేసిన వారసుడుకు ఫ్లాప్ టాక్ వచ్చింది. ఈ రెండిటినీ కంపేర్ చేసి జనం చూస్తోన్న టైమ్ లో దాన్ని డైవర్ట్ చేయడానికా అన్నట్టుగా సడెన్ గా మూడు పెద్ద ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు. ఈ మూవీ టైటిల్స్ చూస్తే ఇవి భారీ చిత్రాలు అని అర్థం అవుతోంది. వాటిలో ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో జటాయు అనే చిత్రం ఉంటుందని చెప్పాడు. రామాయణంలో ఈ జటాయు పక్షి కథ తెలుసు కదా.. మరి ఆ కథ ఈ కథకు సంబంధం ఏదైనా ఉంటుందేమో. ఇక హిట్, హిట్2 మూవీస్ తో సూపర్ హిట్స్ అందుకున్న శైలేష్‌ కొలను దర్శకత్వంలో విశ్వంభర అనే చిత్రం అనౌన్స్ చేశాడు.

విశ్వంభర అనేది గొప్ప సాహితీ వేత్త అయిన సి నారాయణరెడ్డిగారికి జ్ఞానపీఠ పురస్కారం తెచ్చిన కావ్యం పేరు. మరి ఈ చిత్రానికి ఆ నేపథ్యం ఉంటుందా అనేది అప్పుడే చెప్పలేం. అయితే మూడో సినిమా అందరి దృష్టినీ ఆకర్షించింది. కెజీఎఫ్‌ రెండు చాప్టర్స్ తో దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో రావణం అనే టైటిల్ తో సినిమా ఉంటుందని చెప్పాడు.

ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ మూవీ చేస్తున్నాడు. తర్వాత ఎన్టీఆర్ తో సినిమాకు కమిట్ అయి ఉన్నాడు. అలాంటి ప్రశాంత్ నీల్ తో తన బ్యానర్ లో సినిమా ఉంటుందని చెప్పడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అఫ్‌కోర్స్ కొత్త కాంబినేషన్స్ సెట్ చేయడంలో దిల్ రాజు ఎప్పుడూ ముందే ఉంటాడు. మరి ప్రశాంత్ సినిమాలో హీరోగా నటించేది ఎవరా అంటూ ఎవరికి వారు ఫలానా హీరో అని చెప్పేసుకుంటున్నారిప్పుడు. మొత్తంగా దిల్ రాజు అనౌన్స్ చేసిన మూడు సినిమాల టైటిల్స్ లో పడి వారసుడు డిజాస్టర్ టాపిక్ లో లేకుండా పోయింది. ఏదైనా ఈ సీనియర్ ప్రొడ్యూసర్ స్ట్రాటజీయే వేరు..

Related Posts