ఆర్ సీ 15 లో సగం బరువు దించుకున్న దిల్ రాజు

ఓ ప్యాన్ ఇండియా సినిమా నిర్మించాలంటే వందల కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన వ్యవహారమైంది. స్టార్ల రెమ్యునరేషన్ లకే కోట్ల రూపాయలు కుమ్మరించాల్సిన వస్తోంది. ఈ భారీ పెట్టుబడికి భయపడే గతంలో భారతీయుడు 2 సినిమా నుంచి తప్పుకున్నారు నిర్మాత దిల్ రాజు. కానీ ఆ తర్వాత ప్యాన్ ఇండియా సినిమాల బిజినెస్ , రైట్స్ రెవెన్యూ, ఇతర ఆదాయాలు పెరగడంతో ఈ సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అలా రామ్ చరణ్ శంకర్ ల ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నిర్మించేందుకు ముందుకొచ్చారు దిల్ రాజు.

దిగితే గానీ లోతు తెలియదు అన్నట్లు..కోవిడ్ వేవ్ ల మీద వేవ్ లు వచ్చి పడుతున్న టైమ్ లో ఈ భారీ ప్రాజెక్ట్ దిల్ రాజుకు భారమే అయ్యింది. దీంతో ఆయన ప్రొడక్షన్ పార్టనర్ ను చూసుకోక తప్పలేదు. కోట్లాది రూపాయల ఎనీ టైమ్ మనీని ప్రాజెక్ట్ లో ఏటీఎం లాగా జల్లే ఒక కార్పొరేట్ కంపెనీని వెతుక్కున్నారు దిల్ రాజు. అదే జీ స్టూడియోస్ సంస్థ. ఆర్ సీ 15 సినిమాకు జీ స్టూడియోస్ నిర్మాణంలో భాగమవుతోంది. త్వరలో అఫీషియల్ గా దీన్ని అనౌన్స్ చేయబోతున్నారట.

ఈ పార్టనర్ షిప్ లో భాగంగా జీ స్టూడియోస్ కు ఆర్ సీ 15 సినిమా టెలివిజన్, ఓటీటీ ఇతర నాన్ థియేట్రికల్ హక్కులు దక్కనున్నాయి. థియేటర్ రిలీజ్ రైట్స్ మాత్రం దిల్ రాజు తనే తీసుకున్నారు. ఇలా మోయలేని భారమైన ఆర్ సీ 15 సినిమా బరువు దించుకున్నారు దిల్ రాజు.