రంగస్థలం, పుష్ప.. చిత్రాలకు దసరా మూవీకి ఉన్న తేడా ఏంటీ..? అంటే హీరోయిన్ అని ఠక్కున చెప్పేయొచ్చు. ఈ మూడు సినిమాలూ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగేవే. అలాగే గ్రామీణ నేపథ్యంలో నడిచిన కథలే. మూడూ రా అండ్ రస్టిక్ స్టోరీస్ అనిపించుకున్నవే. అయితే మొదటి రెండు సినిమాలూ సుకుమార్ డైరెక్ట్ చేశాడు. దసరా.. అతని శిష్యుడు రూపొందించాడు.

అయినా ఈ మూడు సినిమాల మధ్య ఉన్న కామన్ పాయింట్.. ఆ మాటకొస్తే.. కాస్త మెచ్యూర్డ్ పాయింట్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్. రంగస్థలంలో సమంత పాత్ర ఎంత గ్లామరస్ గా ఉంటుందో తెలుసు కదా..? కొన్ని సన్నివేశాలైతే.. అసలు సుకుమారే తీశాడా అనే డౌట్ కూడా వస్తుంది. అంతే కాదు.. రామ్ చరణ్, సమంత మధ్య సీన్స్ లోనూ బూతుకు దగ్గరగా.. అన్నట్టుగా ఉన్నవి బోలెడు ఉన్నాయి. ఎంత విలేజ్ హీరోయిన్ అయినా అలా ఒళ్లంతా కనిపించేలా పొలం పనులు చేస్తుంది అని చెప్పడం నిజంగా గ్రామీణ ప్రాంత స్త్రీల గురించి తెలిసిన వాళ్లు చేయలేరు.

ఇక సుకుమారే డైరెక్ట్ చేసిన పుష్ప అయితే రంగస్థలంకు నెక్ట్స్ లెవెల్ అనుకోవచ్చు. ఈ మూవీలో వ్యాన్ లోని ఓ సీన్ చాలు.. సుకుమార్ లాంటి దర్శకుడు అలాంటి సీన్స్ ను ఎలా తీశాడు అని షాక్ అవ్వడానికి. అఫ్ కోర్స్.. ఆ సీన్ హీరోగారి డిమాండ్ మేరకే చిత్రీకరించారు అనే రూమర్ టాక్ కూడా ఉందనుకోండి. అయినా చెడ్డపేరు సుకుమార్ కే కదా వచ్చింది. అలాగని సుకుమార్ గత సినిమాల హీరోయిన్లంతా పద్ధతిగా ఉన్నారు అని చెప్పడం కాదు.

కానీ పద్ధతులు మీరితే బి గ్రేడ్ అవుతుంది అని చెప్పడం వరకే ఇక్కడ పాయింట్.
బట్ సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల హీరోయిన్ విషయంలో ఆయన్ని ఫాలో కాలేదు. ఎంత గ్రామీణ ప్రాంతపు అమ్మాయి అయినా.. మాస్ లేడీ అయినా.. తన హీరోయిన్ వెన్నెలను అంతే స్వచ్ఛంగా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ పాత్ర చేసిన కీర్తి సురేష్ ఎక్స్ పోజింగ్ కు ఒప్పుకోదు కాబట్టే చేయలేకపోయాడు అనుకోవచ్చు. బట్ కాదు.

ఎందుకంటే ఈ కథను అతను ఎంత హానెస్ట్ గా డీల్ చేశాడో అందరూ చెబుతూనే ఉన్నారు. అలాంటప్పుడు తన హీరోయిన్ పాత్రను ఎక్స్ పోజింగ్ పేరుతోనో లేక.. వ్యాన్ సీన్స్ లాంటి వాటితోనో దిగజార్చలేడు. సో ఈ మూడు సినిమాల మధ్య ఉన్న పెద్ద డిఫరెన్స్.. దసరా హీరోయిన్.. ఎక్స్ పోజింగ్ చేయలేదు. ఇంకా చెబితే ఆ ఫోటో చూస్తే సులువుగా అర్థం అవుతుందేమో కదా..?