ఓ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన వారికి వెంట వెంటనే ఆఫర్స్ రావడం అనేది కామన్ గా చూస్తాం. కానీ కొందరు మాత్రమే.. ఇందుకు మినహాయింపు. 2022 ఆగస్ట్ లో వచ్చిన సీతారామం సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్ విషయంలో ఇదే జరిగింది. అమ్మడు బోలెడు ఆశలతో టాలీవుడ్ కు వచ్చింది. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. దీంతో ఇక తన కెరీర్ తెలుగులో దూసుకుపోతుంది అనుకుంటే.

ఆ తర్వాత ఒక్క ఛాన్సూ రాలేదు. నిజానికి ఇలాంటివి చాలా రేర్ గా జరుగుతాయి. పోనీ తనేమైనా సీతారామం సినిమాలోలా ఎక్స్ పోజింగ్ కు దూరంగా మడికట్టుకుని ఉంటుందా అంటే అదీ లేదు. రోజూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం కదా.. అమ్మడికి బట్టలంటే ఎంత చిరాకో. సో.. కావాల్సినంత ఎక్స్ పోజింగ్ కూడా చేస్తుంది. అయినా కొత్త సినిమా రావడానికి ఆరు నెలలు టైమ్ పట్టింది. ఫైనల్ గా అమ్మడికి మరో తెలుగు సినిమా అవకాశం వచ్చింది.


చాలాకాలం క్రితమే బాలీవుడ్ లో కెరీర్ మొదలు పెట్టింది మృణాల్ ఠాకూర్. పూర్తి గ్లామరస్ మూవీస్ తో పాటు వైవిధ్యమైన సినిమాల్లోనూ మెప్పించింది. చాలా టాలెంటెడ్ అనిపించుకుంది కానీ.. ఎందుకో అక్కడ స్టార్డమ్ మాత్రం రాలేదు. ఆ స్టార్డమ్ సౌత్ లో వస్తుందేమో అని ట్రై చేస్తే ఇక్కడ ఇంత లేట్ అయింది. అయితే లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టుగా నేచురల్ స్టార్ నాని సినిమాలో తను ఫైనల్ అయింది.

ప్రస్తుతం దసరా మూవీ చేస్తోన్న తన కెరీర్ 30వ సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఈ మూవీని మెమరబుల్ గా మార్చుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఓ కొత్త నిర్మాత రూపొందించే ఈ చిత్రంలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ను కూ తీసుకున్నారు అంటున్నారు. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ.. ఆల్మోస్ట్ తను కన్ఫార్మ్ అయినట్టే అంటున్నారు. మరి ఈ మూవీ అయినా అమ్మడికి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.