ఏ ఫీల్డ్ లో ఉన్నా సక్సెస్ అనే మాట వింటేనే కంటిన్యూ అవుతారు. లేదంటే ఇబ్బందులు తప్పవు. బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నడు సుధీర్. మినీ మెగాస్టా రేంజ్ అనేంత రేంజ్ ఉంది అతనికి. ముఖ్యంగా యూత్ లో ఓ రేంజ్ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ తోనే తర్వాత చాలా షోస్ కు యాంకరింగ్ చేస్తూ.. తన ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా పంచ్ లు వచ్చినా కామ్ గా ఎంజాయ్ చేస్తూ.. జనాల్ని నవ్వించడమే ధ్యేయం అనే డైలాగ్‌స్ తో మరింతగా ఆకట్టుకున్నాడు.

మరి అంత ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులను వెండితెర వదులుకుంటుందా..? మొదట్లో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. తర్వాత హీరోగా మారాడు. సాఫ్ట్ వేర్ సుధీర్ అనే మూవీతో హీరో అయ్యాడు.

తర్వాత జబర్దస్త్ లో తన టీమ్ మేట్స్ అయిన శ్రీను, రాం ప్రసాద్ లతో కలిసి త్రీ మంకీస్ అనే మరో మూవీలోనూ హీరోగా నటించాడు. బట్ ఈ రెండు సినిమాలూ పోయాయి. అయితే సాఫ్ట్ వేర్ సుధీర్ ఫేమ్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలోనే ఇప్పుడు గాలోడు అనే మూవీతో మరోసారి హీరోగా తన లక్ చెక్ చేసుకునేందుకు వచ్చాడు.


ఈ శుక్రవారం విడుదలైన గాలోడుకు బాక్సాఫీస్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మాస్ ఆడియన్స్ కు ఆకట్టుకునే అంశాలు ఉండటంతో మొదటి రోజు ఏకంగా కోటి రూపాయలకు పైగా వసూళ్లు వచ్చాయి. సుధీర్ లాంటి నటుడుడికి ఫస్ట్ డే ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే పెద్ద విషయమే. వీకెండ్ ముసిగేసరికి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందంటోంది ట్రేడ్. విశేషం ఏంటంటే.. ఇది గొప్ప కథేం కాదు. రెగ్యులర్ మాస్ మసాలా ఎంటర్టైనర్ మాత్రమే. అయినా సుధీర్ ఇమేజ్ తో పాటు అతని డ్యాన్సులు, ఫైట్లు.. మూవీకి కలిసొచ్చాయి. హీరోయిన్ గెహన సిప్పీ గ్లామర్ కూడా తోడైంది. మొత్తంగా రెగ్యులర్ కమర్షియల్ సినిమానే అయినా.. ప్రస్తుతానికి ఆకట్టుకుంటోందనే టాకే వినిపిస్తోంది.