నవంబర్ కూడా దెబ్బకొట్టేసినట్టేనా..?

ఏ ఇండస్ట్రీ మనుగడ అయినా దాని విజయాలపైనే ఆధారపడి ఉంటుంది. విజయం లేని ఏ పరిశ్రమా నిలబడలేదు. ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్స్ లో సక్సెస్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ విషయంలో టాలీవుడ్ చాలాకాలంగా తడబడుతోంది. ముఖ్యంగా కోవిడ్ ఎఫెక్ట్స్ తర్వాత కోలుకునేందుకు ఎక్కువ టైమ్ పట్టింది. దీనికి తోడు వస్తోన్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. వస్తున్నవి చిన్న సినిమాలే అయినా.. ఎవరూ సందడి చేయడం లేదు. ఒక్కోసారి చిన్న సినిమాలే పెద్ద విజయాలు సాధిస్తాయి. పెద్ద విజయం అటుంచితే.. అసలు ఆకట్టుకోవడం గగనమైపోయింది. ఇక చాలా ఆశలు పెట్టుకున్న నవంబర్ కూడా టాలీవుడ్ ను నిరాశపరిచింది.
నవంబర్ మొదటి వారంలో వచ్చిన మంచిరోజులు వచ్చాయి ఫస్ట్ షోకే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్స్ తో ఆకట్టుకున్న అసలు బొమ్మ చుక్కలు చూపించింది. దీంతో పాటే వచ్చిన పుష్పక విమానం టైటిల్ గొప్పే కానీ సినిమాలో ఆకట్టుకునేంత స్టఫ్ లేదనిపించుకుంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ నటించిన ఈ చిత్రం కూడా మెప్పించలేకపోయింది.
ఆ తర్వాతి వారం కాస్త అంచనాలతో వచ్చిన కార్తికేయ మూవీ రాజా విక్రమార్క సైతం ఇంప్రెస్ చేయలేకపోయింది. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించుకున్నా సెకండ్ హాఫ్ మాత్రం తేడా కొట్టింది. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ ప్రభావమూ చూపలేకపోయింది. అద్భుతం, దృశ్యం 2 చిత్రాలు ఓటిటిలో వచ్చాయి. అద్భుతం ఆల్రెడీ వచ్చిన ప్లే బ్యాక్ అనే సినిమాలానే ఉంది. దృశ్యం 2 మాత్రం ఓటిటి ఆడియన్సెస్ ను ఆకట్టుకుంది. అదే థ్రిల్ తో దర్శకుడు మరోసారి మెస్మరైజ్ చేశాడు. ఇక చివరి వారం అరడజనుకు పైగా చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో కాస్త ఎక్కువమందికి తెలిసిన చిత్రం అనుభవించు రాజా. రాజ్ తరుణ్ నటించిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ ను మెప్పించలేకపోయింది. ఇవి కాక విడుదలైన ఏ మాత్రం పేరు లేని చిన్న సినిమాల గురించి అయితే అస్సలు మాట్లాడుకోనక్కర్లేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి.
మొత్తంగా సెకండ్ వేవ్ తర్వాత పట్టుమని పది సినిమాలు కూడా ఇప్పటి వరకూ సూపర్ హిట్ అనిపించుకోకపోవడం పరిశ్రమకు గట్టి షాక్ గానే ఉంది. మరి అఖండతో మొదలవుతోన్న డిసెంబర్ అయినా మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి.

Related Posts