చిరంజీవి చిన్నల్లుడిని వదిలేశారా..?

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఓ హీరో వస్తున్నాడంటే ఆ హడావిడీ వేరే ఉంటుంది. చిరంజీవే కాకపోయినా ఆ కుటుంబం నుంచి ఎవరో ఒకరు సదరు చిత్ర ప్రమోషన్ కోసం వస్తుంటారు. కనీసం సోషల్ మీడియా వేదికగా అయినా ప్రమోట్ చేస్తారు. కానీ ఈ సారి చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ సినిమా గురించి ఎవరూ మాట్లాడటం లేదు. అతను హీరోగా ఆ మధ్య సూపర్ మచ్చీ అనే చిత్రం రూపొందింది. కన్నడ టాప్ హీరోయిన్ రచితారామ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మొదలైనప్పుడు మెగా సపోర్ట్ బానే ఉంది. కానీ తర్వాత కనిపించలేదు. ఇక ఈ సంక్రాంతి బరిలో సినిమా విడుదల కాబోతోంది. కానీ మినిమం సందడి కనిపించడం లేదు. అడిగిందే తడవుగా ఇతర చిన్న సినిమాల గురించి ఓ రేంజ్ లో మాట్లాడుతున్నాడు చిరంజీవి. కానీ చిన్నల్లుడి సినిమా వస్తుననా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. దీంతో చాలామందిలో కొత్త సందేహాలు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటా అని చాలామంది ఆరాలు తీస్తున్నారు.
ప్రస్తుతం చిరంజీవి ఈ సినిమానే కాదు.. అసలు అల్లుడినే పట్టించుకోవడం లేదు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే కూతురు, అల్లుడు మధ్య మనస్ఫర్థలు వచ్చాయనీ.. వారిద్దరు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారనే టాక్ కొన్నాళ్ల క్రితమే వచ్చింది. కానీ మధ్యలో ఓ కుటుంబ ఫంక్షన్ లో కలిసినట్టుగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ కనిపించాయి. బట్ అవన్నీ పాత ఫోటోలనీ.. ఇప్పుడు చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడివిడిగానే ఉంటున్నారనీ.. ఈ కారణంగానే మెగా ఫ్యామిలీ కూడా అతన్ని ‘పూర్తిగా’పక్కనబెట్టినట్టు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.
మరోవైపు పరిశ్రమలో ఎవరిదైనా సపోర్ట్ తీసుకుని ఈ సినిమా ప్రమోషన్ చేయాలని కళ్యాణ్ దేవ్ తో పాటు మేకర్స్ ప్రయత్నిస్తున్నా.. చిరంజీవికి తెలిస్తే మాట వస్తుందని ఎవరూ ముందుకు రావడం లేదట. ఏదేమైనా పెద్దవాళ్ల ఇళ్లల్లో జరిగే తంతులన్నీ వింతగానే ఉంటాయి. అయినా మనకెందుకులెండి..

Related Posts