నేచురల్ స్టార్ నాని నుంచి ఓ సినిమా వస్తోందంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఈగర్ గా చూస్తారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఊరమాస్ ఆడియన్స్ చూస్తున్నారు. అందుకు కారణం.. టైటిల్ నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్ తో పాటు ఇప్పటికే విడుదలైన పాటలతో దసరా అనే సినిమా అంచనాలను భారీగా పెంచేయడమే. మమూలుగా నాని ఇమేజ్ కు పూర్తి భిన్నమైన లుక్, టీజర్ చూశాక ఇదేదో ఆషామాషీ సినిమా కాదు అనే కలరింగ్.. దీనికి తోడు దర్శకుడి గురించి నాని చెప్పిన మాటలు.. అందుకు తగ్గట్టుగానే టీజర్ లో కనిపించిన షాట్స్. ఇవన్నీ చూసిన తర్వాత దసరా సినిమా ఓ సంచలనం సృష్టించబోతోంది అని ముందే ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్.

అందుకే ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియన్ లెవల్లో విడుదల చేస్తున్నారు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు దసరా మూవీ ట్రైలర్ విడుదలైంది. ఊహించినట్టుగానే అంచనాలకు మించి కనిపిస్తోంది ఈ ట్రైలర్. ఇప్పటి వరకూ జనం పక్కింటి కుర్రాడిలాంటి హీరో అని చెప్పుకుంది ఈ నాని గురించేనా ఒక్కసారిగా డౌట్స్ మొదలయ్యాయి. సినిమాలో ధరణి అనే కుర్రాడి పాత్రలో కనిపించబోతోన్న నాని అచ్చంగా ఆ పాత్రలానే ట్రైలర్ లోనే కనిపించాడు. ఇప్పటి వరకూ తను చేసిన ఏ సినిమాకు సంబంధించి ఒక్క చిన్న రిఫరెన్స్ కూడా ఈ క్యారెక్టర్ లో లేదు. నాని ఇప్పటి వరకూ చాలా సినిమాల్లో ఫైట్స్ చేశాడు. బట్ ఈ మూవీ చూస్తే ఫైట్స్ కాదు.. బాడీ మొత్తం ఫైర్ చేసినట్టుగా ఉన్నాడు.


దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇప్పటి వరకూ పెద్దగా ఎక్స్ పోజ్ కాలేదు. కానీ కంటెంట్ ఉన్నోడు తన వాయిస్ తో కాక తన వర్క్ కు సంబంధించిన వాయిస్ తో మాట్లాడతాడు అని ఈ ట్రైలర్ చూస్తే మరోసారి అర్థం అవుతుంది. సింగరేణి కాలరీస్ నేపథ్యంలో సాగే కథ అని ముందే చెప్పారు. ట్రైలర్ చూస్తే పీరియాడిక్ సెటప్ కూడా కనిపిస్తోంది. రైళ్లలో రవాణా అయ్యే బొగ్గును దొంగిలించే బ్యాచ్ లా నాని అండ్ టీమ్ కనిపిస్తోంది. కీర్తి సురేష్ కు ట్రైలర్ లో పెద్దగా ప్రాధాన్యం లేదు. కానీ.. ఆ పాత్రే సినిమాకు అత్యంత కీలకం అని గతంలో చెప్పారు.


ఇక ట్రైలర్లోనే వినిపించిన డైలాగ్స్ నెక్ట్స్ లెవల్లో ఉన్నాయి. ‘తాగి సోయి దప్పుడు, లుంగి ఎత్తి కట్టి ఎవడెవడ్నో కొట్టుడు, దిగినంక గదే లుంగి దించి ఆగమాగం చేసుడు అనే డైలాగ్ ధరణి పాత్రను సూచిస్తుంది. ఇక పోలీస్ స్టేషన్ లో లాఠీ సీన్ భలే ఉంది. ‘తాగి మర్సిపోవుడు తప్పు కాదు. తప్పు చేసి మర్సిపోవుడు తప్పు’ అంటూ మోస్ట్ టాలెంటెడ్ మళయాలీ యాక్టర్ షినే టామ్ చాకో చెప్పిన డైలాగ్ హైలెట్ గా ఉంది. అలాగే ధరణికి నాయనమ్మ గా నటించిన ఆవిడ చెప్పిన మాట ‘కత్తిని పట్టినవంటే నువ్వు ఏ తోవలో పోతున్నవో తెలుస్తుందా’ అనే డైలాగ్ ఆ క్యారెక్టరైజేషన్ తీసుకున్న టర్న్ ను చూపిస్తుంది.

ఇక సముద్రఖని చెప్పిన ‘పది తలకాయలున్నోడే ఒక్క తలకాయ ఉన్నోడి సేతుల కుక్క సావు సచ్చిండు, పురాణాలను మించిన బతుకులా మనయి’అనేది ధరణి ఎదుర్కొనే విలన్ ఎంత బలమైన వాడు అనేది సూచిస్తోంది. ట్రైలర్ లో కనిపించిన చివరి షాట్ దర్శకుడి ప్రతిభతో పాటు నాని ఎంత గొప్ప నటుడు అనేదానికి మరో ఉదాహరణగా కనిపిస్తోంది.


ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత నాని చెప్పినట్టుగా ఈ దర్శకుడు గురించి టాలీవుడ్ మొత్తం మాట్లాడుకుంటుంది అని చెప్పొచ్చు. షాట్ డివిజన్, టేకింగ్, మేకింగ్, కంటెంట్ పై కాన్ఫిడెన్స్, ప్రతి సీన్ పై అతని కమాండ్.. ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపించింది. మొత్తంగా దసరా మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనే మాటకు అతి దగ్గరగా ఉంది అనిపిస్తోంది. ఇక సమ్మర్ సందడిని దసరా గ్రాండ్ గా స్టార్ట్ చేస్తుందని బలంగా నమ్మేయొచ్చు.