దసరా దర్శకుడికి ధమాకా ఆఫర్..

ఒక్క హిట్ పడితే ఓవర్ నైట్ ఫేమ్ అయిపోతున్న రోజులు. అలాగే ఒక్క ఫ్లాప్ కే కనిపించకుండా పోతున్న దర్శకులూ ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉన్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. రీసెంట్ గా వచ్చిన అతని డెబ్యూ మూవీ దసరా.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కొత్త దర్శకుడైనా ఆ ఛాయలేవీ అతని టేకింగ్ లో కనిపించలేదు.

మేకింగ్ పరంగానూ చాలా క్లియర్ గా ఉన్నాడు శ్రీకాంత్. అందుకే కథలో కాన్ ఫ్లిక్ట్ మరీ పెద్దగా ఎలివేట్ కాకపోయినా.. కొన్ని డల్ సీన్స్ ఉన్నా.. వాటిని తన మేకింగ్ తో కవర్ చేశాడు. ఓ తెలివైన దర్శకుడికి ఉండాల్సింది ఈ లక్షణాలే. అందుకే అతనికి పెద్ద నిర్మాతల నుంచి అడ్వాన్స్ చెక్ లు వచ్చి పడుతున్నాయి. అందులో ముందుగా కమిట్ అయ్యింది సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్.

పైగా ఈ బ్యానర్ లో రెండో సినిమా చేసే దర్శకులు.. ‘‘ద్వితీయ విఘ్నం’’ను సులువుగా దాటేస్తారు అనే సెంటిమెంట్ కూడా ఉంది. ఆ సెంటిమెంట్ కు తలవంచాడో లేక.. తన పే చెక్ ను బట్టి కమిట్ అయ్యాడో కానీ శ్రీకాంత్ ఓదెల నెక్ట్స్ మూవీ సితార బ్యానర్ లో ఉంటుందని బలంగా వినిపిస్తోంది. మరి హీరో ఎవరూ అనే కదా..? ఇంకెవరూ మన ఏజెంట్.


యస్.. అక్కినేని అఖిల్ తో శ్రీకాంత్ ఓదెల నెక్ట్స్ మూవీ ఉంటుందనే ప్రచారం బాగా సాగుతోంది. ఈ మేరకు అతను ఆల్రెడీ ఓ లైన్ కూడా వినిపంచాడట అఖిల్ కు. అఖిల్ కూ ఆ లైన్ నచ్చినా.. ఇంకా బెటర్ స్టోరీస్ ఉంటే కూడా చూడమని చెప్పాడట. ప్రస్తుతం కథను తేల్చే పనిలో ఉన్నాడు శ్రీకాంత్. అది ఓకే అయిన వెంటనే ఈ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అవుతుంది. కాకపోతే ఇక్కడే ఓ చిక్కొచ్చింది.
ప్రస్తుతం అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ రిలీజ్ కు ఉంది.

అయితే ఈ సినిమా చిత్రీకరణ టైమ్ నుంచి చాలా ఇష్యూస్ ఫేస్ చేసింది.అందులో ప్రధానంగా వినిపించిన విషయం దర్శకుడు, హీరోకు మధ్య వచ్చిన గ్యాప్. ఈ గ్యాప్ కారణంగానే చాలా సన్నివేశాలను మళ్లీ మళ్లీ చిత్రీకరించారు అని చెబుతారు. అందులో నిజమెంత అనేది పక్కన బెడితే.. ఇప్పుడైతే ఏజెంట్ దర్శకుడు సురేందర్ రెడ్డి, అఖిల్ మధ్య మంచి టర్మ్స్ అయితే లేవని ఇండస్ట్రీ అంతా చెప్పుకుంటోంది. మరి సురేందర్ రెడ్డి లాంటి వాడే అఖిల్ కు భయపడితే ఇక శ్రీకాంత్ వంటి దర్శకుల పరిస్థితి ఏంటీ అనేది కూడా ఆలోచించుకోవాలి.

కాకపోతే కొన్నిసార్లు కథకు సరెండర్ అయితే.. అలా సరెండర్ చేయగలిగితే ఏ హీరో అయినా దర్శకుడు చెప్పింది వింటాడు. అలా ఉండాలి.. కథ, స్క్రీన్ ప్లే పక్కాగా ఉండాలి. షూటింగ్ కు వెళ్లడానికి ముందే క్లియర్ గా బౌండ్ స్క్రిప్ట్ తో వెళ్లాలి. ఏదేమైనా.. శ్రీకాంత్ ఓదెలకు ఇప్పుడు టైర్ టూ హీరోలు కూడా అందుబాటులో లేరు. అందుకే అఖిల్ తో అయినా ఓకే అంటాడు అనే చెబుతున్నారు. మరి ఈ కాంబోలో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.

Related Posts