డిసెంబ‌ర్ డైరీ ఫుల్ మ‌రి.. విజేత‌గా ఎవ‌రో..?
Latest Movies Tollywood

డిసెంబ‌ర్ డైరీ ఫుల్ మ‌రి.. విజేత‌గా ఎవ‌రో..?

సంక్రాంతికి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయ‌క్ చిత్రాలు వ‌స్తుండ‌డంతో కొన్ని సినిమాలు డిసెంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యాయి. డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ లో బాల‌య్య‌, బోయ‌పాటి కాంబినేష‌న్లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అఖండ రిలీజ్ కానుంది. ఆ వెంటనే స్కైలాబ్ సినిమా వస్తోంది. ఆత‌ర్వాత వారంలో మూడు సినిమాలు ఫిక్స్ అయిపోయాయి. నాగశౌర్య లక్ష్య, కీర్తి సురేష్ గుడ్ లక్ సఖీ కూడా డేట్ లు అనౌన్స్ చేశాయి. ఆత‌ర్వాత వారం తిరగకుండానే బన్నీ, సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా వ‌స్తుంది.

ఆత‌ర్వాత వారం నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మి, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇవి కాక మలయాళ భారీ సినిమా, హాలీవుడ్ పెద్ద సినిమాలు వుండనే వున్నాయి. అంటే దాదాపు పది సినిమాల వరకు డిసెంబర్ లోనే జనాల ముందుకు వ‌స్తున్నాయి. కేవలం కీలకమైన సినిమాలు లెక్క వేసుకున్నా, దాదాపు 225 కోట్ల వరకు షేర్ రూపంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క డిసెంబర్ నెలలోనే రావాల్సి వుంటుంది. 225 కోట్ల షేర్ అంటే.. 350 కోట్ల‌ గ్రాస్ అనుకోవచ్చు. ఈ లెక్క‌న రోజుకు దాదాపుగా 10 కోట్ల పైనే రావాలి. మ‌రి.. డిసెంబ‌ర్ నెలలో ఈ సినిమాలు ఎంత క‌లెక్ట్ చేస్తాయో చూడాలి.

Post Comment