సినిమా పరిశ్రమలకు మళ్లీ డేంజర్ బెల్స్

ఒమిక్రాన్.. కొత్త వేరియంట్ గా అందరినీ భయపెడుతోంది. కానీ నిజానికి పెరుగుతున్నది మళ్లీ కరోనా.. యస్.. ప్రపంచ వ్యాప్తంగా కరోనానే మళ్లీ పెరుగుతోంది. దీనివల్ల ఎలాంటివిలయం జరుగుతుందో ఆల్రెడీ తెలుసు కాబట్టే.. పెద్ద సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. తెలుగులోనే కాదు.. తమిళ్ లో కూడా టాప్ స్టార్ అజిత్ మూవీనీ పోస్ట్ పోన్ చేశారు. అంటే ఇక తమిళనాట కూడా చిన్న సినిమాల హవా స్టార్ట్ అవుతుందా..?
తమిళనాడు సూపర్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ ఉన్న నటుడు అజిత్. అతను నటించిన సినిమా వలీమై. అంటే శక్తి అని అర్థం. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ కు అద్బుతమైన స్పందన వచ్చింది. దీంతో సినిమా బిగ్గెస్ట్ హిట్ కొట్టబోతోందని ఫ్యాన్స్ అంతా జోష్ లో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ వాయిదా పడ్డ తర్వాత కూడా వీళ్లు ఆ మేటర్ చెప్పలేదు. దీంతో వలీమై ట్రిపుల్ ఆర్ లేని టైమ్ లో ఇంకా పెద్ద విజయం సాధిస్తుందనుకున్నారు. ఇటు తెలుగులో కూడా రిలీజ్ అంటూ పోస్టర్లు కొట్టేశారు. బట్ ఈ చిత్రం కూడా పోస్ట్ పోన్ అయింది.
తమిళ నాట పెద్ద స్టార్స్ కు ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలుసు. అలాంటి వారి సినిమా వస్తే కరోనా నిబంధనలు మచ్చుకు కూడా గుర్తుకు రావు. దీనివల్ల పెద్ద ప్రమాదమే వస్తుంది. అందుకే థియేటర్స్ ను 50శాతం ఆక్యుపెన్సీకి కుదించారు. ఇది వలీమై లాంటి పెద్ సినిమాకు మైనస్ అవుతుంది. అందుకే ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఇక ఈ మూవీకి గతంలో ఖాకీ చిత్రంతో ఆకట్టుకున్న హెచ్ వినోద్ దర్శకుడు. మన ఆర్ఎక్స్ 100 కుర్రాడు కార్తికేయ విలన్ గా నటించాడు. మొత్తంగా భారీగా విడుదలవుతుందనుకున్న వలీమై కూడా పోస్ట్ పోన్ కావడం సినిమా పరిశ్రమలకు మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయని గుర్తించాల్సిందే.

Related Posts