కన్ఫార్మ్ .. బాలయ్యతో రొమాన్స్ కు చందమామ ఫైనల్

నందమూరి నటసింహం బాలకృష్ణ జోరు బాగా పెరిగిందీ మధ్య. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అఖండతో అదరగొట్టి.. రీసెంట్ గా సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డితో కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు. కలెక్షన్స్ పరంగా మాత్రమే చూస్తే ఈ మూవీ ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా చెప్పొచ్చు. ఇక కుర్రాళ్లను మించిన దూకుడుతో వరుస మూవీస్ చేస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇది బాలయ్య 108వ సినిమా. అయితే ఈ సినిమాలో అంతా ఊహించినట్టుగానే చందమామనే హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. బట్ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.


సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం కష్టం.. కానీ బాలయ్యకు కాదు అనేలా ఉంది సిట్యుయేషన్. ఆయన ప్రతి సినిమాకూ హీరోయిన్ విషయంలో కాస్త ఆలస్యం అవుతున్నా.. ఫైనల్ గా బెస్ట్ బ్యూటీసే ఫైనల్ అవుతున్నారు. అఖండలో శ్రుతి హాసన్, హనీ రోజ్ లతో బాలయ్య మంచి పెయిర్ గా నిలిచాడు. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా కోసం మరోసారి హనీరోజ్‌ నే తీసుకుంటారు అనే టాక్ వచ్చింది. అందుకు కారణం ఈ చిత్రంలో బాలయ్యకు ఓ కూతురు కూడా ఉంటుంది. ఆ పాత్రకోసం ధమాకా బ్యూటీ శ్రీ లీలను తీసుకున్నారు. మరి శ్రీ లీలకు తల్లిగా అంటే ఆల్రెడీ హనీ రోజ్ బాలయ్యే తల్లిగా నటించింది కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు అనుకున్నారు. మరి ఏమైందో.. హనీరోజ్ కాదని.. కాజల్ అగర్వాల్ నే ఫైనల్ చేశారు. కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగింది కాజల్.

అందరు టాప్ హీరోలతో నటించింది. చిరంజీవితో రీ ఎంట్రీ ఖైదీ నెంబర్ 150తో పాటు ఆచార్యలో కూడా నటించింది. ఆచార్యలో తన పాత్రను పూర్తిగా తొలగించారు. ఈ తరం హీరోల్లో మెగాస్టార్ తో మాత్రమే నటించిన తను ఇప్పుడు బాలయ్యకు జోడీగా చిందేసేందుకు సిధ్ధమైంది. కొన్నాళ్లుగా ఈ కాంబినేషన్ గురించి వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను బట్టి కాజల్ ను ఒప్పించారా లేక కాజల్ ఆఫర్ రాగానే ఓకే చేసిందా అనేది తేలాలి. ఇక ఆ మధ్య పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చింది కాజల్.

డెలివరీ అయిన వెంటనే ఎక్స్ సైజులు మొదలుపెట్టింది. అంటే తను రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అని చెప్పేసిందన్నమాట. కొన్నాళ్లుగా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తోంది కాజల్. ఫైనల్ గా బాలయ్య మూవీతో వస్తోంది. ఇక అనిల్ రావిపూడి సినిమా అంటే అన్ని హంగులూ ఉంటాయి కాబట్టి.. కాజల్ పాత్రకూ మంచి ప్రాధాన్యతే ఉంటుందనుకోవచ్చు. కాకపోతే తను శ్రీ లీలకు తల్లిగా నటించబోతోందా అనే ట్విస్ట్ మాత్రం అలాగే ఉంది. కాజల్ ను అప్పుడే మరో హీరోయిన్ కు తల్లిగా చూడటం ఆమె అభిమానులకు షాక్ ఇస్తుందనే చెప్పాలి.

Related Posts