చైనా మరో దుశ్చర్య కయ్యానికి రంకెలు
Inside Media Latest Politics

చైనా మరో దుశ్చర్య కయ్యానికి రంకెలు

చైనా దుశ్చర్యలు ఆగడం లేదు.. పూటకో వివాదం, రోజుకో కొత్త తగాదా…. ఇదే పనిలా పెట్టుకుంది డ్రాగన్‌ కంట్రీ.. గతేడాది గాల్వన్‌ లోయలో భారత్‌ ఘన విజయం సాధించింది.. చైనాని ఉక్కిరి బిక్కిరి చేసింది.. ఆ దేశం దాదాపు భారత్‌ చేతిలో ఓడిపోయిందని అంతర్జాతీయ మిలిటరీ నిపుణులు సైతం వ్యాఖ్యానించారు.. పుంఖానుపుంఖాలుగా కథనాలు వెలువరించారు.. భారత్‌ తనను అత్యంత దారుణంగా ఓడించిందనే కసి, ఆగ్రహం, ఆవేశం, కోపం చైనాలో అడుగడుగునా కనిపిస్తున్నాయి.. అందుకే, ఇండియాపై ఎలా అయినా ఆధిపత్యం ప్రదర్శించి తన స్థాయి ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్‌ చేసుకోవాలని భావిస్తోంది డ్రాగన్‌.. అందుకే, రోజుకో కుట్రతో భారత్‌ పై కయ్యానికి కాలు దువ్వుతోంది చైనా..

ఇటీవల కొన్ని రోజుల క్రితం ఇండోచైనా బోర్డర్‌ లోని అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుల వరకు రైల్వే లైన్‌ నిర్మించడానికి ప్రణాళికలు రచించుకుంది.. దీనిపై భారత్‌ తీవ్రంగా మండిపడింది.. వారం రోజుల క్రితం.. సరిహద్దులలో భారీ కాంక్రీట్‌ గోడను నిర్మించుకునేందుకు ప్లాన్‌ చేసింది.. దీనిపై భారత్‌ వార్నింగ్‌ ఇచ్చింది.. ఈ రెండు అంశాలపై క్లారిటీ రాకముందే.. డ్రాగన్‌ కంట్రీ మరో దుందుడుకు చర్యకు తెరలేపింది..

తాజాగా తూర్పు లడఖ్ ప్రాంతానికి సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో ఎయిర్ బేస్ విస్తరణ చేపట్టింది. ఇప్పటికే ఇక్కడ ఓ ఎయిర్ బేస్ ఉండగా, దాన్ని ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా పునర్ నిర్మిస్తోంది. వాస్తవాధీన రేఖకు అత్యంత చేరువలో ఉండే షాక్చే పట్టణంలో ఈ ఎయిర్ బేస్ ఏర్పాటవుతోంది. ఇక్కడి నుంచి యుద్ధ విమాన కార్యకలాపాలు సాగించాలన్నది చైనా ప్రణాళిక. వాస్తవాధీన రేఖ వెంబడి చైనాకు కష్గర్, హోగన్ ఎయిర్ బేస్ లు ఉండగా, వాటి మధ్య దూరం 400 కిలోమీటర్లు. ఇప్పుడు ఆ రెండింటి మధ్యలో తాజా ఎయిర్ బేస్ నిర్మాణం చేపడుతోంది. దాంతో వాస్తవాధీన రేఖ పొడవునా చైనా యుద్ధ విమానాల కార్యకలాపాలు ఎంతో సులభతరం అవుతాయి. త్వరలోనే షాక్చే ఎయిర్ బేస్ నుంచి చైనా ఫైటర్ జెట్ల కార్యకలాపాలు షురూ అవుతాయని రక్షణ రంగ వర్గాలంటున్నాయి.

భారత నిఘా వర్గాలు ఈ కొత్త ఎయిర్ బేస్ పై ఓ కన్నేసి ఉంచాయి. ఎల్ఏసీ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే… భారత్ తో పోల్చితే చైనా వాయుసేన సన్నద్ధత ఈ ప్రాంతంలో బలహీనం అని చెప్పాలి. ఈ ప్రాంతంలో భారత్ అనేక స్వల్ప నిడివి ఎయిర్ బేస్ లు నిర్మించింది. దాంతో ఏ ప్రాంతం నుంచైనా యుద్ధ విమానాలను అతి తక్కువ సమయంలో మోహరించే వీలుంటుంది. ఈ ప్రాంతంలో భారత్ సత్తా ఎలాంటిదంటే… ఏకకాలంలో చైనా, పాకిస్థాన్ లతో పోరాడాల్సి వచ్చినా లడఖ్ ప్రాంతంలోని ఎయిర్ బేస్ ల నుంచి తగిన సంఖ్యలో యుద్ధ విమానాలను పంపే వీలుంది. మరి, ఈ తాజా పరిణామాలు ఎప్పుడు ఎలాంటి టర్న్‌ తీసుకుంటాయో చూడాలి..

Post Comment