చైనా దారుణాన్ని బయటపెట్టిన ఫ్రాన్స్‌
Latest

చైనా దారుణాన్ని బయటపెట్టిన ఫ్రాన్స్‌

ప్రపంచానికి కరోనా లాంటి మహమ్మారిని అంటకట్టి.. చిద్విలాసంగా నవ్వుకుంటోన్న డ్రాగన్‌ కంట్రీ చైనా మరో విధ్వంసానికి, వివాదానికి కేరాఫ్‌ గా మారుతోంది.. ఆ దేశంలోని న్యూక్లియర్‌ ప్లాంట్‌…. నేడు ప్రపంచానికి పెద్ద తలనొప్పిగా మారుతోంది.. గుయాంగ్‌ డాండ్‌ ప్రావిన్స్‌ లోని తైషాన్‌ అణు విద్యుత్ ప్లాంట్‌ నుండి న్యూక్లియార్‌ రేడియేషన్‌ విడుదల అవుతోంది.. ఈ ప్లాంట్‌ ని రూపొందించిన ఫ్రాన్స్‌ సంస్థ ఫ్రామాటోమ్‌ సైతం దీనిని మూసివేయాలని బలంగా చెబుతోంది..

తైషాన్‌ అణు విద్యుత్‌ ప్లాంట్‌ ని ఫ్రాన్స్‌ సంస్థ నిర్మించింది.. దీని మాతృ సంస్థ ఎలక్ట్రిసిటీ డీ ఫ్రాన్స్‌.. గత కొంతకాలంగా తైషాన్‌ అణు విద్యుత్‌ ప్లాంట్‌ నుండి రేడియేషన్‌ విడుదల అవుతోంది.. రెండు ప్లాంట్‌ లలోని ఒక ప్లాంట్‌ ఇంధన రాడ్‌ లనుండి రేడియేషన్‌ రిలీజ్‌ అవుతోందట.. దీనిని సరిదిద్దకపోతే, త్వరలోనే పెను నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందని చెబుతున్నారు ఫ్రాన్స్‌ కి చెందిన ప్లాంట్‌ నిపుణులు..

తమ దేశంలోని ప్లాంట్‌ ఇలాంటి ఘటనలు సంభవించి ఉంటే… తాము ఎప్పుడో మూసివేసి ఉండేవారమని, చైనా తమ అభ్యంతరాలను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు తైషాన్‌ అణు విద్యుత్‌ ప్లాంట్‌ ని నిర్మించిన ఫ్రాన్స్‌ సంస్థ మేనేజ్‌మెంట్‌. గతంలో అమెరికాలో సైతం ఇలాంటి ఘటనలను సీరియస్‌ గా తీసుకోకపోవడంతో పెను విపత్తుకు దారితీశాయని చెబుతున్నారు.. ఇప్పటికి అయినా ఇంధన రాడ్లను సరిచేసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు.. తమకు తెలిసినంతవరకు ప్రస్తుతానికి కేవలం రెండు ఇంధన రాడ్లు మాత్రమే దెబ్బతిన్నాయని, త్వరలో అది మరింత పెరిగే చాన్స్‌ ఉందని విశ్లేషిస్తున్నారు.

మరోవైపు, చైనా అణు విద్యుత్‌ నిపుణులు మాత్రం.. ఫ్రాన్స్‌ కంపెనీ హెచ్చరికలను లైట్‌ తీసుకుంటున్నారు. ఇలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.. అయితే, ఊహించని విపత్తు సంభవిస్తే లక్షల సంఖ్యలో పౌరులు, మూగ జీవాలు విగత జీవులుగా మారడం ఖాయమని.. తైషాన్‌ ని మరో చెర్నోబిల్‌ కాకుండా చూసుకోవాలనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.. మరి, డ్రాగన్‌ ఇప్పటికయినా కళ్లు తెరుస్తుందా..?? లేక, పెను ముప్పు సంభవించిన తర్వాల మేలుకొంటుందా..?? అనేది పెను సవాల్‌ గా మారుతోంది.

Post Comment