ఒక్కరోజులో మారిపోయిన ఓటింగ్… ఆ కంటెస్టెంట్ ఔట్..??
Latest Reality shows Small Screen Social Media Trending News

ఒక్కరోజులో మారిపోయిన ఓటింగ్… ఆ కంటెస్టెంట్ ఔట్..??

ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించలేం.. ఇది క్రికెట్ లాంటి గేమ్స్ లోనేకాదు… బిగ్ బాస్ హౌజ్లోనూ సేమ్ సీన్.. అప్పటిదాకా ఒక అభ్యర్ధికి అనుకూలంగా ఉన్న పరిణామాలు ఒక్క క్షణంలో మారిపోతాయి. ఊహించని కంటెస్టెంట్ టాప్ పొజిషన్ కి వెళతాడు.. ఇక అప్పటిదాకా టాప్లో ఉన్న కంటెస్టెంట్… లీస్ట్ లోకి దిగజారుతాడు… అనూహ్యంగా బయటకు వచ్చేస్తాడు.. మొదటివారం బిగ్ బాస్ హౌజ్ లోనూ ఇదే జరిగేలా కనిపిస్తోంది..

బిగ్ బాస్ హౌజ్ లో తొలి ఎలిమినేషన్ కి రంగం సిద్ధం అవుతోంది.. మొదటివారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనేది హాట్ టాపిక్ గా మారుతోంది.. తొలి వారంలో ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.. యాంకర్ రవి, ఆర్జే కాజల్, బోల్డ్ బ్యూటీ సరయు, మోడల్ జెస్సీ, సింగర్ హమీదా, సీరియల్ నటుడు మానస్.. ఈ ఆరుగురిలో ఒకరు దాదాపు హౌజ్ నుండి బయటకు రావడం ఖాయం.. అయితే, ఎవరనేది హాట్ టాపిక్ గా మారుతోంది..

బుధవారం ఎపిసోడ్ టెలికాస్ట్ కానంతవరకు అంతా మోడల్ జెస్సీ, సింగర్ హమీదాలలో ఒకరు ఎలిమినేట్ అవడం గ్యారంటీ అనుకున్నారు.. అయితే, ఆ తర్వాత నుండి జరిగిన పోల్స్, టెలికాస్ట్ అయిన ఎపిసోడ్స్ స్క్రీన్ స్పేస్ ని చెక్ చేసిన తర్వాత పరిణామాలు అనూహ్యంగా మారిపోయినట్లు తెలుస్తోంది.. తొలి వారం బోల్డ్ బ్యూటీ సరయు బయటకు రానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి పలు కారణాలు చెబుతున్నారు ఎనలిస్టులు..

ముఖ్యంగా హమీదా, మోడల్ జెస్సీకి మంచి స్క్రీన్ స్పేస్ ఇస్తున్నాడు బిగ్ బాస్.. ఇద్దరూ వివాదాలలో ఉంటున్నారు.. ఇటు, కొంతమంది కంటెస్టెంట్స్ తో జాలీగా గడుపుతున్నారు.. కానీ, బోల్డ్ బ్యూటీ సరయు విషయానికి వస్తే.. ఇప్పటిదాకా ఆమెకు కేటాయించిన స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉందని గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు.. దీనికితోడు, ఆమెకు బయట ఉన్న ఇమేజ్ కి.. ఫ్యామిలీ ఆడియెన్స్ అంతగా ఆదరించరనే టాక్ కూడా ఉంది.. మరోవైపు, ఆమె స్మోకింగ్ చేస్తున్న విజువల్స్ ని రిలీజ్ చేశాడు బిగ్ బాస్. అంటే, ఇది ఆమెకు కాస్త నెగిటివ్ గా మారుతుందోన్న అభిప్రాయాలువినిపిస్తున్నాయి..

మరోవైపు, సింగర్ హమీదాకి, ఇండియన్ ఐడల్ విన్నర్, టాలీవుడ్ టాప్ సింగర్ లలో ఒకరయిన శ్రీరామచంద్ర మధ్య కెమిస్ట్రీ బిల్డ్ చేయడానికి బిగ్ బాస్ చోటు కల్పిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ సింగింగ్ బ్యాక్ డ్రాప్ నుండి రావడం, మరోవైపు, హమీదా.. శ్రీరామచంద్రతో ఈజీగా కలిసిపోవడం, తన అభిప్రాయాలను షేర్ చేసుకోవడం ఆమెని కాపాడుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.. రీసెంట్ గా విడుదలయిన ప్రోమో ఆ ఇద్దరినే టార్గెట్ చేసింది.. దీంతో, హమీదా బయటకు వచ్చే చాన్స్లు తక్కువ అని చెబుతున్నారు విశ్లేషకులు.

హౌజ్ లోపల అంశాలతోపాటు హౌజ్ బయట కూడా పలు యూ ట్యూబ్ చానెల్స్, వెబ్ సైట్స్ పోస్టింగ్స్ లోనూ సరయుకి తక్కువ ఓటింగ్స్ పడుతున్నాయి.. తొలి వీకెండ్ ఎలిమినేషన్ కోసం హమీదా వర్సెస్ సరయు మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది పోల్స్లో.. అయితే, మెజారిటీ యూ ట్యూబ్ చానెల్స్ పోల్స్ లో సరయుకే తక్కువ మార్కులు పడుతున్నాయి.. దీంతో ఆవిడ దాదాపు ఎలిమినేట్ అవడం ఖాయగా కనిపిస్తోందని చెబుతున్నారు ఎనలిస్టులు.. అయితే, ఎలిమినేషన్ కి మరో రెండు రోజులు మాత్రమే ఉంది. ఆదివారం నాటికి హౌజ్లో అనూహ్య పరిణామాలు జరిగితే మినహా…. ఆ ఇద్దరిలో ఒకరు బయటకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.. అయితే, సరయునే వస్తోందనే టాక్ వినిపిస్తోంది.. మరి, ఈ రెండు రోజులలో ఆమె తన గేమ్ స్ట్రాటజీని మార్చుకుంటుందా..?? లేదా..? అనేది చూడాలి..

Post Comment