Latest Politics

రేవంత్ రెడ్డిలో ఈ మార్పేంటీ..? 

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నాడు రేవంత్ రెడ్డి. సాధారణ నాయకుడు నుంచి ఇప్పుడు ఎమ్.పిగా పిసిసి ప్రెసిడెంట్ గా ఎదిగాడు. అయితే కొన్నాళ్ల క్రితం వరకూ అతను చాలా అగ్రెసివ్ అనిపించుకున్నాడు. ఎవరినీ లెక్కచేయని మనస్తత్వంగా చెప్పుకున్నారు. కానీ పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత సడెన్ గా స్లో అయ్యాడు. తన అగ్రెసివ్ నెస్ కు కొంత బ్రేక్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరినీ కలుపుకు వెళుతున్నాడు. టీఆర్ఎస్ ను గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తనపై వస్తోన్న ప్రతి విమర్శనూ సునిశితంగా తిప్పికొడుతూ.. ప్రజల్లో మరింత నమ్మకాన్ని, సానుభూతిని సంపాదిస్తున్నాడు. మరోవైపు టీఆర్ఎస్ పై మాత్రం తన దూకుడును ఏ మాత్రం తగ్గించలేదు.
తాజాగా తనను పార్లమెంట్ సభల్లో పాల్గొనకుండా చేసిన టిఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు రేవంత్. ప్రధానంగా కోకాపేట్ భూముల అమ్మకంపై కొన్ని సంచలన ఆరోపణలు కూడా చేశాడు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్నిసీరియస్ గా తీసుకుంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి సమస్యలు తప్పవు అనే చెప్పాలి. మొత్తంగా అయిన వారి దగ్గర అణకువగా, ప్రభుత్వంపై ఆవేశంగా కనిపిస్తూ రేవంత్ పిసిసి చీఫ్ గా అతి తక్కువ టైమ్ లోనే తనదైన ముద్రను వేస్తున్నాడని చెప్పాలి.

Post Comment