కొత్త సంవత్సరంలో నాలుగు నెలలు పండగే
Latest Movies Tollywood

కొత్త సంవత్సరంలో నాలుగు నెలలు పండగే

కొత్త సంవత్సరంలో సినిమాల పండగ మామూలుగా ఉండదు. ఓ రేంజ్ లో ఉండబోతుంది. సంక్రాంతకి కానుకగా ఆర్ఆర్ఆర్ రాబోతుంది. జనవరి 7న ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల. ఈ నెలలోనే జనవరి 14న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ విడుదల కానుంది. ఇక ఫిబ్రవరిలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా విడుదల. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నారు. చిరు, చరణ్‌ కలిసి నటించిన సినిమా కావడంతో మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

అలాగే విక్టరీ వెంకటేష్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎఫ్ 3. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నెల 25 రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అఫిషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఇక సంక్రాంతికి వస్తుంది అనుకున్న పవర్ స్టార్ భీమ్లా నాయక్ మూవీ మార్చి 31న రానుందని సమాచారం. ఈ మూవీ రిలీజ్ డేట్ విషయమై క్లారిటీ రావాల్సివుంది. ఇక ఏప్రిల్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట రిలీజ్ కానుంది. ఈ మూవీ కూడా సంక్రాంతికి రావాల్సింది కానీ.. ఆర్ఆర్ఆర్ వస్తుండడంతో వాయిదా పడనుంది. ఏప్రిల్ 28న సర్కారు వారి పాట రిలీజ్ అంటున్నారు. అందుచేత కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి వరుసగా నాలుగు నెలల వరకు సినీ అభిమానులకు పండగే పండగ.

Post Comment