క్రేజీ అంకుల్స్ – రివ్యూ
Latest Reviews

క్రేజీ అంకుల్స్ – రివ్యూ

శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, పోసాని కృష్ణ మురళి, బండ్ల గణేష్ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం క్రేజీ అంకుల్స్. గుడ్ సినిమా గ్రూప్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఎంటర్ టైన్మెంట్ సినిమాలు తెరకెక్కించే ఇ.సత్తిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే కంటెంట్ తో ఈ సినిమా తీసారనిపించింది. టైటిల్ కి తగ్గట్టుగా ఈ క్రేజీ అంకుల్స్ పై క్రేజ్ ఏర్పడింది. ఈ మూవీ విడుదలకు దగ్గర పడుతున్న టైమ్ లో క్రేజీ అంకుల్స్ సినిమాలో మహిళలను కించపరిచేలా చూపించారంటూ మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. ఈ వివాదస్పద చిత్రం క్రేజీ అంకుల్స్ ఈ రోజు (ఆగష్టు 19)న విడుదలైంది. మరి.. క్రేజీ అంకుల్స్ లో మహిళా సంఘాలు ఆరోపించినట్టుగా అలాంటి సన్నివేశాలు ఉన్నాయా..? ఇంతకీ.. క్రేజీ అంకుల్స్ ఎంత వరకు ఆకట్టుకున్నారు.? అనేది చెప్పాలంటే.. ముందుగా క్రేజీ అంకుల్స్ కథ ఏంటో చెప్పాలి.

కథ –

రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రాజు (రాజా రవీంద్ర), బంగారం వ్యాపారం చేసే రెడ్డి(సింగర్ మనో) ఫైనాన్స్ వ్యాపారం చేసే రావు(భరణి శంకర్) ముగ్గురు మంచి స్నేహితులు. ఒక అపార్ట్ మెంట్ లోనే కలిసి జీవిస్తూ ఉంటారు. అయితే.. ఈ ముగ్గురికి తమ భార్యలతో సంసారం జీవితంలో సమస్యలు ఉంటాయి. దీంతో ఈ ముగ్గురికి సింగర్ స్వీటీ (శ్రీముఖి) అంటే బాగా ఇష్టం. అందుచేత ఆమెతో ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తారు. ఆ రోజు జరిగిన ఘటనతో ఈ ముగ్గురు జీవితాలు ఎలా మారిపోయాయి? ఎన్ని మలుపులు తిరిగాయి ? అనేది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్-

మనో నటన
కామెడీ
శ్రీముఖి గ్లామర్
ట్విస్టులు

మైనస్ పాయింట్స్-

రొటీన్ క్లైమాక్స్
అక్కడక్కడా స్లోగా ఉండడం

విశ్లేషణ-

సింగర్ గా ఇప్పుడు జబర్దస్త్ లో జడ్జిగా బాగా పరిచయమైన మనో అలియాస్ నాగూర్ బాబు ఈ సినిమాలో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ లో నటించారు. రెడ్డి గారు అనే పాత్రలో ఆయన నటించిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆయన కనిపించినంత సేపు నవ్వులు పూయిస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. ఆయనకు ఇచ్చిన పాత్రను సమర్థవంతంగా పోషించారు. మనో పాత్ర తర్వాత చెప్పుకోవాల్సింది శ్రీముఖి గురించి. కథ శ్రీముఖి చుట్టూ తిరుగుతున్నట్లు అనిపించినా నిడివి మాత్రం ఆమెకు కొంచెం తక్కువగా ఉంటుంది.

బుల్లితెర పై అల్లరి చేస్తూ సందడి చేసే శ్రీముఖి తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సింగర్ స్వీటీ పాత్రలో ఒదిగిపోయి నటించింది. ప్రేక్షకులను మెప్పించింది అనడంలో సందేహం లేదు. ఇక రాజారవీంద్ర, భరణి శంకర్ తనదైన శైలిలో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రవీణ్, బండ్ల గణేష్ కూడా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే గిరి, హేమ, భార్గవి, విజయ, పోసాని కృష్ణ మురళి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. రఘు కుంచె సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేకార్షణ అని చెప్పచ్చు.

దర్శకుడు ఇ.సత్తిబాబు మంచి పాయింట్ తీసుకుని దానిని ఎంటర్ టైనింగ్ గా చెప్పే ప్రయత్నం చేశారు. రొమాంటిక్ కామెడీ కోరుకునే ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చి తీరుతుంది అని చెప్పవచ్చు. అయితే..మహిళా సంఘాలు గొడవల వల్ల సినిమా కాస్త లైమ్ లైట్ లోకి వచ్చింది. కానీ వాళ్లు అభ్యంతరాలు చెప్పే విధంగా ఎక్కడా సీన్లు గాని డైలాగులు గాని లేవు. అక్కడక్కడా స్లోగా అనిపించి కొన్ని సీన్లు ఏంటీ ఇది అనిపించేట్టు ఉన్నా.. మొత్తానికి ఈ క్రేజీ అంకుల్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు.

రేటింగ్ –  2.75/5

Post Comment