రాజమౌళి ఆ హీరోనూ డిమాండ్ చేయగలడా..? పవన్ ఫ్యాన్స్ ప్రశ్న

రాజమౌళి .. ఇండియాస్ టాప్ డైరెక్టర్ గా వెలుగుతున్నాడు. మగధీర, ఈగ, బాహుబలి మూవీస్ తో ప్రపంచ వ్యాప్తంగా గ్రేట్ మేకర్ అనిపించుకున్నాడు. అలాంటి దర్శకుడు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో వస్తున్నాడు. రామ్ చరణ్ – ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ చిత్రాన్ని జనవరి 7న విడుదల చేస్తున్నారు. ఈ మూవీ కోసం చాలా సినిమాలను పోస్ట్ పోన్ చేయించాడు రాజమౌళి. ఆ లిస్ట్ లో సంక్రాంతి బరిలో ఉన్న కొన్ని మహేష్ బాబు సర్కారు వారి పాట, ఎఫ్ 3తో పాటు బాలీవుడ్ మూవీ గంగూబాయ్ కతియావాడి కూడా ఉంది. అయితే సంక్రాంతి బరిలోనే ఇంకా ప్రభాస్ రాధేశ్యామ్, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కూడా ఉన్నాయి. రాధేశ్యామ్ పై ఎలాంటి బజ్ లేదు. దీంతో పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ సినిమాను కూడా పోస్ట్ పోన్ చేయాలని ఒత్తిడి చేశారు.. చేస్తున్నారు. బట్.. ఈ విషయంలో పవన్ తగ్గడం లేదు. పోస్ట్ పోన్ చేయడం కుదరదని ఖచ్చితంగా చెప్పేశాడు. దీంతో నిర్మాతలు కూడా పవన్ వైపే ఉన్నారు.
ఇక ఈ మొత్తం ఎపిసోడ్ లో చాలామంది రాజమౌళినే విమర్శిస్తున్నారు. ఆల్రెడీ అందరూ డేట్స్ అనౌన్స్ చేసుకున్న తర్వాత రాజమౌళి మధ్యలో వచ్చి ముందు అనౌన్స్ చేసిన వారిని వెనక్కి వెళ్లమనడం ఏ న్యాయం అని నిలదీస్తున్నారు. అయినా భీమ్లా నాయక్ ను పోస్ట్ పోన్ చేయించేందుకు చివరి వరకూ ప్రయత్నించేలా ఉన్నారు వీళ్లు. దీంతో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఓ కొత్త క్వశ్చన్ లేపారు.
సంక్రాంతి బరిలోనే తమిళ్ సూపర్ స్టార్ అజిత్ సినిమా వాలిమై ఉంది. అక్కడ అజిత్ సినిమా అంటే క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ సినిమా రేంజ్ లో ఆడియన్సెస్ ఎగడబడతారు. ఆర్ఆర్ఆర్ ప్యాన్ ఇండియన్ సినిమా కదా.. మరి ఇప్పుడు కోలీవుడ్ నుంచి అజిత్ సినిమాను కూడా పోస్ట్ పోన్ చేయిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజమే.. ఇక్కడో న్యాయం అక్కడో న్యాయం ఎందుకు.. ? అజిత్ ను ఒత్తిడి చేస్తే పోతుంది కదా అంటున్నారు కామన్ ఆడియన్సెస్. మరి ఆ సత్తా రాజమౌళి టీమ్ కు ఉందా..? ఒకవేళ వీళ్లు అడిగితే మాత్రం అజిత్ ఒప్పుకుంటాడా..? సో మన సినిమా అయితే వెనక్కి వెళ్లినా ఫర్వాలేదు. పరాయి చిత్రాల జోలికి మాత్రం వెళ్లరు.. అంతేనా జక్కన్నా..?

Related Posts