బన్నీ అయితే నాకేంటి.. అంటున్న సన్నీ
Latest Movies Tollywood

బన్నీ అయితే నాకేంటి.. అంటున్న సన్నీ

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – ఇంటిలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్నపాన్ ఇండియా మూవీ పుష్ప. బన్నీ సరసన ఇందులో క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుంది. ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత బన్నీ, సుక్కు కలిసి చేస్తున్న సినిమా కావడం.. ఇది బన్నీ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. రెండు పార్ట్ లుగా వస్తున్న ఈ సినిమాలోని ఫస్ట్ పార్ట్ ను ఆగష్టు 13న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా కుదరడం లేదు.

ఈ సంవత్సరం చివరిలో ఈ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. సుకుమార్‌ సినిమా అంటే.. అందులో ఐటం సాంగ్ ఎలా ఉంటుందో.. ఏ రేంజ్ లో సక్సస్ అవుతుందో తెలిసిందే. సుకుమార్ తెరకెక్కించిన ఆర్య, ఆర్య 2, 100% లవ్, రంగస్థలం తదితర చిత్రాల్లో ఐటం సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అందులోని పాటలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉన్నాయి. వాటిని మించిపోయేలా పుష్పలో ఓ ఐటం సాంగ్‌ కంపోజ్‌ చేస్తున్నాడట రాక్ స్టార్ దేవిశ్రీ. ఈ ప్రత్యేక పాటలో బన్నీతో స్టెప్పులేయడానికి బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దింపనున్నారని ఆమధ్య వార్తలు వచ్చాయి.

ప్రముఖంగా బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీని సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఊర్వశి రౌతేలా పేరు తెర పైకి వచ్చింది. తాజాగా ఆమె స్థానంలో మరో నటి పేరు బలంగా వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు.. మాజీ పోర్న్‌ స్టార్‌, బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌. ఈ బ్యూటీని ఐటం సాంగ్‌ కోసం సంప్రదించినట్లు టాలీవుడ్ లో టాక్‌ వినిపిస్తోంది. అయితే.. ఈ సినిమాలోని ఐటం సాంగ్ లో నటించేందుకు ఆమె అక్షరాలా 90 లక్షలు డిమాండ్‌ చేసిందట. బన్నీ సినిమా ఇది అని చెబితే.. బన్నీ సినిమా అయితే నాకేంటి..? అని నటించాలంటే.. తను చెప్పిన రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పిందట. ఆమెకున్న డిమాండ్‌ అలాంటిది కాబట్టి మేకర్స్‌ కూడా అడిగినంత ఇచ్చేందుకు ఓకే చెప్పారని తెలిసింది. అన్నీ అనుకున్నట్టుగా జరిగి బన్నీ పుష్పలో సన్నీ నటిస్తే.. ఈ ఐటం సాంగ్ తో యూట్యూబ్ షేక్ అవ్వడం ఖాయం.

Post Comment