చాక్లెట్ బాయ్ ని విలన్ గా మార్చిన బోయపాటి

బోయపాటి శ్రీను సినిమాలంటే హీరోలు ఎంత బలంగా ఉంటారో.. అంతకు మించి అనేలా విలన్స్ ఉంటారు. అతని విలన్స్ ను చూస్తేనే వణుకు పుడుతుంది. ఇక ఫైట్స్ ఏ రేంజ్ లో తీస్తాడో తెలిసింది. తన హీరో ఫిజిక్ తో పనిలేకుండా వందల మందిని ఒంటి చేత్తో మట్టి కరిపిస్తుంటాడు. సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నా.. బోయపాటి మూవీ అంటే హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటాయి. అందుకే హీరోలు కూడా అతనితో వర్క్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తాం అని చెబుతారు. మరోవైపు మాజీ హీరోలను విలన్స్ గా మార్చడంలో ఎక్స్ పర్ట్ అయిన బోయపాటి లేటెస్ట్ గా ఓ చిన్న హీరోను పేద్ద విలన్ గా మార్చాడట. మరి ఈ విలన్ ఎవరు.. ఏ సినిమాలో..?


ఫస్ట్ భద్ర నుంచి చివరి సినిమా అఖండ వరకూ మాస్ ఆడియన్స్ టార్గెట్ గా వచ్చాడు బోయపాటి శ్రీను. తను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది ముత్యాల సుబ్బయ్య వద్ద. ఈయన స్కూల్ ను పూర్తి భిన్నంగా బోయపాటి సినిమాలు కనిపిస్తాయి. టేకింగ్ పరంగానూ మేకింగ్ పరంగానూ హై ఓల్టేజ్ తోనే కనిపిస్తాయి. క్లాస్ హీరోగా భావించిన వెంకటేష్ తోనూ ఫ్యాక్షన్ కత్తి పట్టించి తులసిన చేసిన ఘనత బోయపాటిది. ఇక బాలయ్యతో చేసిన సింహా, లెజెండ్, అఖండల్లో యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో రక్తపాతం సృష్టించాయో కొత్తగా చెప్పక్కర్లేదు. రామ్ చరణ్ తో చేసిన వినయవిధేయ రామ, బెల్లంకొండ శ్రీనుతో చేసిన జయజానకి నాయక చిత్రాల్లో ఫైట్ సీన్స్ కు స్పెషల్ ఫ్యాన్స్ కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక లెజెండ్ సినిమాతో ఫ్యామిలీ స్టార్ అనే ట్యాగ్ తెచ్చుకున్న జగపతిబాబును క్రూరమైన విలన్ గా మార్చాడు.

ఈ మూవీతో జగపతి కెరీరే మారిపోయింది. అఖండతో శ్రీకాంత్ తో వరదరాజులుగా మరింత క్రూరమైన విలనీ చేయించాడు. ఈ రెండు సినిమాల్లో ఈ మాజీ హీరోల విలనిజం పెద్ద హైలెట్ అయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో సినిమా చేస్తున్నాడు బోయపాటి. మాస్ ఇమేజ్ లేని రామ్ కూడా ఏకంగా 300మందిని కొట్టే ఫైట్ ఒకటి పెట్టాడట. అయితే లేటెస్ట్ గా వినిపిస్తోన్నదాన్ని బట్టి చూస్తే ఈ మూవీలో ప్రిన్స్ అనే యంగ్ స్టర్ ను విలన్ గా మార్చాడట. ప్రిన్స్ తేజ డైరెక్షన్ లో వచ్చిన నీకూ నాకూ డాష్ డాష్‌ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. తర్వాత బస్ స్టాప్, రొమాన్స్ వంటి మూవీస్ తో మెప్పించినా..

హీరోగా పెద్ద బ్రేక్ రాలేదు. రీసెంట్ గా డిజే టిల్లులో చేసిన పాత్ర మంచి గుర్తింపు ఇచ్చింది. ఇక రామ్ తో గతంలో నేను శైలజ చిత్రంలో కీర్తి సురేష్ అన్న పాత్రలో కనిపించాడు ప్రిన్స్. చూడగానే చాక్లెట్ బాయ్ లా కనిపించే ప్రిన్స్ ను బలమైన విలన్ గా మార్చాడట బోయపాటి. ఇందుకోసం అతనికి స్పెషల్ గెటప్ కూడా వేయించారంటున్నారు. ఈ గెటప్ చూస్తేనే భయం పుట్టేలా ఉంటుందనే టాక్ వస్తోంది. మరి ఈ విలనిజంతో ప్రిన్స్ కెరీర్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో కానీ.. ఈ మూవీలో రామ్ సరసన హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తోంది. ఈ సమ్మర్ లోనే ఈచిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Related Posts