సింగం సిరీస్ గుర్తుకురాగానే దర్శకుడు హరి అతి వేగంగా చూపించే టేకింగ్ గుర్తొస్తుంది. పూరీ జగన్నాథ్, బోయపాటిల హీరో మిక్స్ అయినట్టుగా కనిపించేలా అతని హీరో గుర్తొస్తాడు. ప్రతి సీన్ జెట్ స్పీడ్ తో పరుగులు తీస్తుంది. ఇండియాలో అలాంటి దర్శకుడు అతను మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. అతను క్రియేట్ చేసిన సింగం సిరీస్ కు ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు.

అందుకే ఈ సింగం ను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేశాడు దర్శకుడు రోహిత్ శెట్టి. అజయ్ దేవ్ గణ్‌, రణ్‌వీర్ సింగ్ నటించిన అక్కడి సింగంలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు రోహిత్ శెట్టి మరో సింగం కోసం ప్లాన్ చేశాడు. ఆశ్చర్యంగా ఈ సారి ఈ ఇద్దరు హీరోలను కాదని బాలీవుడ్ టాప్ బ్యూటీ దీపికా పదుకోణ్‌తో ఆ పాత్ర చేయించబోతున్నాడు. అంటే సింగం పాత్రలో లేడీ పోలీస్ ఉంటుందన్నమాట.


పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ రొమాన్స్ లోనూ తగ్గేదే లే అనిపించుకుంటోన్న దీపికా పదుకోణ్‌ ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే లో నటిస్తోంది. తనను హీరోయిన్ గా తీసుకుని సింగం సినిమా అనౌన్స్ చేశాడు రోహిత్ శెట్టి. విశేషం ఏంటంటే.. ఇప్పటి వరకూ డిఫరెంట్ రోల్స్ తో ఆకట్టుకున్న సన్నజాజి దీపికా పదుకోణ్ ఇలా ఓ పోలీస్ పాత్ర చేయడం ఫస్ట్ టైమ్. అది కూడా చాలా పవర్ ఫుల్ కాప్ సిరీస్ లో నటంచడం అంటే ఛాలెంజింగ్ గానే ఉంటుంది. సింగం సిరీస్ అంటే ఫైట్స్ కూడా బానే ఉంటాయి. వాటి కోసం కఠోరంగా శ్రమించాలి. రియలిస్టిక్ గా కనిపించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి.


వచ్చే యేడాది నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోన్న ఈ మూవీకి సంబంధించి మరో విశేషం ఏంటంటే.. దర్శకుడు రోహిత్ శెట్టితో కలిసి దీపికా పదుకోణ్‌ఫస్ట్ టైమ్ వర్క్ చేయబోతోంది. మరి ఈ లేడీ సింగం గర్జనకు బాక్సాఫీస్ భయపడుతుందా లేదా అనేది చూడాలి.