పవన్ ను అలా చిరంజీవి ని ఇలా లైన్ లో పెడుతోన్న బిజెపి

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు అంటారు. అందుకే రకరకాల పార్టీల మధ్య ఇన్ని జంపింగులు చేస్తుంటారు నాయకులు. లేటెస్ట్ గా చిరంజీవి తనలాంటి సున్నిత మనస్కులు పాలిటిక్స్ లో రాణించలేరు.. కానీ పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి సాధిస్తాడు అంటూ కీలక వ్యాఖ్యలు చేసాడు. అతను సాధిస్తాడా లేదా అనేది పక్కన బెడితే ఒక రోజు టిడిపి మరో రోజు బిజెపి తో మీటింగ్ లు చేస్తూ కేడర్ ను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. రీసెంట్ గా వైజాగ్ ఘటన తర్వాత వెంటనే చంద్రబాబు తో హోటల్ లో మీట్ అయ్యి తమ పొత్తు కుదిరింది అన్న సంకేతాలు ఇచ్చాడు. కట్ చేస్తే కొన్ని రోజుల్లోనే అదే వైజాగ్ లో పీఎం నరేంద్ర మోడీ తో సుదీర్ఘ మంతనాలు జరిగాయి.


ఐతే రాజకీయ విశ్లేషకులు చెప్పేదాన్ని బట్టి చూస్తే పవన్ బిజెపి తోనే ఉంటాడు అనేది అర్థం అవుతుంది. దానికి మరో సంకేతం లేటెస్ట్ గా చిరంజీవి చేసిన కామెంట్స్. దానికి దీనికి సంబంధం ఏంటి అనుకోవచ్చు. కానీ ఆయనలా చెప్పిన మరుసటి రోజే చిరంజీవి కి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా నిర్వాహకులు ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ ౨౦౨౨ కి చిరంజీవిని ఎంపిక చేశారు. నిజానికి ఈ సత్కారానికి మెగాస్టార్ హండ్రెడ్ పర్శంట్ అర్హుడే. కానీ ఫెస్టివల్ మొదలైన తర్వాత అది కూడా ఆయన పవన్ గురించి పొలిటికల్ కామెంట్స్ చేసిన తర్వాత ప్రకటించడం లో రాజకీయ కోణాన్ని చూస్తున్నారు విశ్లేషకులు. ఇదే పురష్కారం మెగాస్టార్ కు ఎప్పుడో ఇచ్చి ఉండాల్సింది. కేంద్రం లో ఉన్నది బిజెపి. ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయం గా బలపడాలని చూస్తోంది. అందుకు తమ్ముడు సిద్ధంగానే ఉన్నా .. అన్నయ్యను కూడా ఇండైరెక్ట్ గా బుట్టలో వేసే ప్రయత్నంలో భాగంగానే సడెన్ గ చిరంజీవికి ఈ అవార్డు ప్రకటించారు అనేవాళ్లూ ఉన్నారు.


మరి మెగాస్టార్ కమలం పువ్వులో పడతాడా లేదా అనేది చెప్పలేం కానీ ఈ గొప్ప గౌరవాన్ని అందుకోబోతోన్న అన్నయ్యకు అభినందనలు చెబుదాం.

Related Posts