బ్లాక్ బస్టర్ ప్లానింగ్స్ తో బర్త్ డే బాయ్ విజయ్ దేవరకొండ

సినిమా పరిశ్రమలో ఎవరూ టాప్ హీరోగానే ఎక్కువ కాలం కొనసాగలేరు. ఇక్కడ టాలెంట్ తో పాటు కృషి, పట్టుదల, అదృష్టం కూడా కీలకం. అతి తక్కువ టైమ్ లో స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండ కథ కూడా అదే చెబుతుంది. మరి ఇప్పుడు ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ ప్రయాణం ఎక్కడ మొదలైంది.. అనేదానికంటే ముందు లైగర్ గురించి ఓసారి చూద్దాం.


విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ప్యాన్ ఇండియన్ సినిమాలోకి ఎంటర్ అయ్యాడు. ఈ మూవీ కోసం అతను ఎంతో దూకుడుగా ప్రమోషన్స్ చేశాడు. ఆ దూకుడు కంట్రీ మొత్తం ఫిదా అయింది. దేశవ్యాప్తంగా విజయ్ పేరు మార్మోగిపోయింది.


లైగర్ రిజల్ట్ ఎలా ఉన్నా.. ఈ చిత్రం కోసం విజయ్ పడ్డ శ్రమ, ప్రమోషన్స్ లో చూపించిన అగ్రెసివ్ నెస్, సినిమాను తను ఎంతలా ప్రేమిస్తాడో తెలుపుతూ.. దేశవ్యాప్తంగా తిరుగుతూ సినిమాపై హైప్ పెంచేందుకు అతను చూపిన ఉత్సాహం లైగర్ కు భారీ ఓపెనింగ్స్ ను తెచ్చింది. ఇది కేవలం విజయ్ వల్లే సాధ్యం అయింది. అంతే కాదు. ఈ చిత్రంతో అతనిలోని ఓ కొత్త స్పార్క్ ను స్టార్ గా దేశం గుర్తించింది.


మరి ఇంత పెద్ద ప్రయాణం ఎక్కడ మొదలైందీ అంటే 2016లో వచ్చిన పెళ్లి చూపులుతో. అంతకు ముందు చిన్న పాత్రలు చేసినా.. హీరోగా తెరంగేట్రం చేసిన పెళ్లి చూపులు విజయ్ ని ఓవర్ నైట్ఇండస్ట్రీ గుర్తించే�