బిగ్ బాస్ లోకి హాట్ యాంకర్..!! నేడో రేపో ఎంట్రీ…!!
Latest Reality shows Small Screen Social Media Viral News

బిగ్ బాస్ లోకి హాట్ యాంకర్..!! నేడో రేపో ఎంట్రీ…!!

బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ సీజన్ మొదలు కానుందా…?? త్వరలోనే ఓ హాట్ యాంకర్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోందా..?? ప్రతి సీజన్ లోనూ దాదాపు థర్డ్ వీక్ లోనే బిగ్ బాస్ హౌజ్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరిగేది.. సీజన్ ఫైవ్ లో నాలుగో వారానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ముహూర్తం ఫిక్స్ చేశారట బిగ్ బాస్.. దీంతో, నేడో రేపో ఓ హాట్ యాంకర్ హౌజ్ లోకి అడుగు పెట్టనుందనే ప్రచారం జరుగుతోంది..

నిన్నమొన్నటిదాకా ఇద్దరు యాంకరమ్మలు బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తారనే రూమర్ వినిపించింది.. డ్యాన్స్ రియాలిటీ షో… ఢీ తో పాపులర్ అయిన యాంకర్ వర్షిణి… ఈ సీజన్లో ఎంట్రీ గ్యారంటీ అనే టాక్ వినిపిస్తోంది.. అయితే, ఆమె టాలీవుడ్ చుల్ బులీ అక్కినేని సమంత నటిస్తోన్న లేటెస్ట్ మూవీ శాకుంతలంతోపాటు మరో రెండు సినిమాలు చేతిలో ఉండడంతో బిగ్ బాస్ షోకి నో చెప్పిందట.. ఇటు, ఎంటర్ టెయిన్మెంట్ చానెల్స్ తోపాపులర్ అయిన వర్షిణితోపాటు న్యూస్ చానెల్స్ తో ఆడియెన్స్ కి కనెక్ట్ అయిన ప్రశాంతి, రోజాలో ఒకరు బిగ్ బాస్ హౌజ్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని భావించారంతా..

తాజాగా ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు కూడా సీజన్ ఫైవ్ కనిపించేందుకు, వైల్డ్ కార్డ్ తో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదట.. అందుకే, ఈ ముగ్గురిని పక్కనబెట్టి… కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా పోవే పోరాతోపాటు పలు షోలు చేసిన యాంకర్ విష్ణు ప్రియకి వైల్డ్ కార్డ్ ఆఫర్ ఇచ్చిందట బిగ్ బాస్ యాజమాన్యం.. ఇటీవల బుల్లితెర షోలకి గుడ్ బై చెప్పి … బిగ్ స్క్రీన్ పై లక్ టెస్ట్ చేసుకుంటోన్న ఈ బ్యూటీ మరింత పాపులారిటీని కోరుకుంటోందట.. దానికి సరయిన వేదికగా బిగ్ బాస్ హౌజ్ ని ఎంచుకుంటోందని సమాచారం..

మరోవైపు, భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంతో విష్ణు ప్రియ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.. ఈ వీకెండ్ న ఇద్దరు కంటెస్టెంట్ లు ఎలిమినేషన్ కి రెడీ అవుతున్నారట.. అందుకే, విష్ణు ప్రియ ఎంట్రీతో ఆ లోటును భర్తీ చేసేందుకు బిగ్ బాస్ రెడీ అవుతున్నాడని సమాచారం.. ఇది ఎంతవరకు నిజమో త్వరలోనే తేలనుంది..

Post Comment