ఓవర్ నైట్ లో మారిపోయిన ఓటింగ్ ఆ ఇద్దరికీ సన్నీ స్ట్రోక్…!!
Latest Reality shows Small Screen Viral News

ఓవర్ నైట్ లో మారిపోయిన ఓటింగ్ ఆ ఇద్దరికీ సన్నీ స్ట్రోక్…!!

సన్ స్ట్రోక్ అంటే.. వడదెబ్బ తగిలితే రెండు మూడు రోజులు తేరుకోవడం కష్టం.. బిగ్ బాస్ హౌజ్ లో ఇద్దరు ముగ్గురికి ఈ వీక్ లో సన్నీ స్ట్రోక్ తగిలిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి..

ఈ వీక్ లో బిగ్ బాస్ హౌజ్ లో జరిగిన కెప్టెన్సీ టాస్క్ సెగలు రేపింది.. ఫైనల్స్ వరకు కేవలం ముగ్గురు కంటెస్టెంట్స్ మాత్రమే నిలిచారు.. శ్వేతా వర్మ, శ్రీరామ్, వీజే సన్నీ మాత్రమే పోటీలో నిలిచారు.. హౌజ్ మేట్స్ ముందు ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ తమకు ఎందుకు ఓటు వేయాలో తమ వాయిస్ వినిపించారు.. ఇక్కడే వీజే సన్నీకి వ్యూయర్స్ కి అనూహ్యంగా మద్దతు లభిస్తోంది.. ఆయనకు అన్యాయం జరిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది..

ముగ్గురు కంటెస్టెంట్స్ లో సన్నీని టార్గెట్ చేశారు హౌజ్ మేట్స్.. హౌజ్ లో ఓట్ వేసిన పదమూడు మందిలో ఏకంగా ఎనిమిది మంది సన్నీకి వ్యతిరేకంగా ఓటు వేశారు.. అందరిదీ ఒకటే వాదన.. సన్నీకి ఇంకా కెప్టెన్ అయ్యే సమర్ధత రాలేదని, హౌజ్ మేట్స్ ని కమాండ్ చేయలేడని, అందుకే తాము సన్నీకి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నామని తెలిపారు మెజారిటీ కంటెస్టెంట్స్..

కాజల్, హమీదా, అనీ మాస్టర్, మానస్, జెస్సీ మినహా మిగిలిన వారంతా సన్నీకి కత్తిపోటు పొడిచి మరీ ఆయన కెప్టెన్ గా పనికిరాడని ఓటు వేశారు.. దీంతో, ఒక్కసారిగా షాక్ అయ్యాడు సన్నీ.. హౌజ్ మేట్స్ లో తనపట్ల ఇంతటి వ్యతిరేక భావన ఉందని తాను ఊహించలేకపోయానని వాపోయాడు.. ఒకానొకదశలో కన్నీటి పర్యంతం అయ్యాడు వీజే సన్నీ.. కెప్టెన్సీ టాస్క్ లో తన కో పార్టిసిపెంట్ అయిన మానస్ ని ఒప్పించి మరీ రేసులో నిలిచాడు వీజే సన్నీ..

అనూహ్యంగా తనకు వ్యతిరేకంగా ఇన్ని ఓట్లు పడతాయని మెజారిటీ కంటెస్టెంట్స్ తనపై నెగిటివ్ భావనను పెంచుకున్నారని ఊహించలేకపోయాడు సన్నీ.. ఎప్పుడూ ఎంతో జోవియల్ గా, అందరినీ అనునయిస్తూ కనిపించే సన్నీని టార్గెట్ చేయడంపై వ్యూయర్స్లో సానుభూతి పెంచింది.. సన్నీ తప్పేమీలేదని తేల్చిపారేస్తున్నారు క్రిటిక్స్ సైతం. సన్నీ అద్భుతంగా ఆడాడని, అతని గేమ్ లో తప్పేమీ లేదని అభిప్రాయ పడుతున్నారు.. అందుకే, సన్నీకి ఓవర్ నైట్ లో భారీగా ఓటింగ్ పడుతోంది..

Post Comment