ఈ వారం నామినేషన్స్ లో ఆ ఏడుగురు..??
Latest Movies Reality shows Small Screen Trending News

ఈ వారం నామినేషన్స్ లో ఆ ఏడుగురు..??

బిగ్ బాస్ హౌజ్ గంటగంటకూ వేడెక్కుతోంది.. తొలి ఎలిమినేషన్ జరిగిపోయింది.. తొలి వారం బోల్డ్ బ్యూటీ సరయు బయటకు వచ్చేసింది.. సెకండ్ వీక్ ఎంటర్ అయింది.. సోమవారం కావడంతో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది.. ఈ వారం నామినేషన్ ప్రక్రియ కూడా హాట్ హాట్ గా సాగినట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా, కంటెస్టెంట్ లు ఒకరిపై ఒకరు మాటల దాడి మొదలుపెట్టారు..

హౌజ్ లోకి ఎంటరై వారం రోజులు కావడంతో ఒకరి మీద ఒకరికి అభిప్రాయాలు ఏర్పడ్డాయి.. ఒకరి అభిరుచులు, అభిప్రాయాలు, ఇష్టాఇష్టాలు ఏంటో తెలుస్తున్నాయి.. అంతేకాదు, ఎవరు ఎవరితో ఎలా ఉంటున్నారో కూడా అర్ధం అవుతోంది. దీంతో, తమకు నచ్చని కంటెస్టెంట్స్ పై మాటల యుద్దం షురూ చేశారు..

సెకండ్ వీక్ నామినేషన్ ప్రోమో తాజాగా రిలీజ్ అయింది.. ఈ ప్రోమోలో హీరోయిన్ శ్వేతా వర్మ ఇచ్చి పడేసింది.. ముఖ్యంగా లోబో, సింగర్ హమీదాపై ఆమె ఓ రేంజ్లో విరుచుకుపడింది… బోల్డ్ బ్యూటీ సరయు బయటకు వచ్చిన తర్వాత రిలీజ్ అయిన వీడియోలో ఎంతటి ఆగ్రహం, ఆవేశం ప్రదర్శించిందో.. దానికి పది రెట్లు ఆగ్రహంతో ఊగిపోయింది శ్వేతా వర్మ..

ముఖ్యంగా లోబో, హమీదాపై ఆమె రంగులు పూసి ఎటాక్ చేసిన తీరు హౌజ్లోని సభ్యులనే షాక్ కి గురిచేసింది.. ఆమెను కంట్రోల్ చేయడానికి ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్లు ప్రయత్నించిన విజువల్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి.. అయితే, ఆమె ఆవేశాన్ని నియంత్రించడానికి, ఆమెకి కౌంటర్ ఇవ్వడానికి ఇటు లోబో, అటు హమీదా కనీస ప్రయత్నం కూడా చేసినట్లు కనిపించలేదు..

అయితే, ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.. అనీ మాస్టర్, నటరాజ్ మాస్టర్, ప్రియా, ప్రియాంక సింగ్, లోబో, ఉమా దేవి, ఆర్ జే కాజల్ ఉన్నట్లు తెలుస్తోంది.. గత సీజన్ ల కంటే భిన్నంగా ఈ సీజన్ లో ఏకంగా 19 మందిని హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.. దీంతో, ఈ వారంలో ఇద్దరు కంటెస్టెంట్ లు బయటకు రావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.. మరోవైపు, ఈ వారమే వైల్డ్ కార్డ్ తో ఓ టాప్ యాంకర్ ఎంటర్ కానుందనే రూమర్ వినిపిస్తోంది.. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ…. బిగ్ బాస్ హౌజ్ సెకండ్ వీక్ కే పొగలు, సెగలు కక్కుతోంది..

Post Comment