ఈ వారం డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు.. ఎవరు ఔట్..?? ఎవరు ఇన్..??
Latest Reality shows Small Screen Social Media

ఈ వారం డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు.. ఎవరు ఔట్..?? ఎవరు ఇన్..??

బిగ్ బాస్ తొలి వారం ఎలిమినేషన్ జరిగింది.. బోల్డ్ బ్యూటీ సరయు హౌజ్ నుండి బయటకు వచ్చేసింది.. సెకండ్ వీక్ నామినేషన్ లు సైతం జరిగిపోయాయి.. ఏకంగా ఏడుగురు కంటెస్టెంట్స్ లు నామినేట్ అయ్యారు.. ప్రియా, ప్రియాంక సింగ్, ఉమా దేవి, ఆర్ జే కాజల్, నటరాజ్ మాస్టర్, లోబో, అనీ మాస్టర్ ఉన్నారు.. ఈ ఏడుగురిలో ఒకరు బయటకు రావడం ఖాయం.. అయితే, ఎవరు సేఫ్ అవుతారు..? ఎవరు ఔట్ అవుతారు..?? అనేది హాట్ టాపిక్ గా మారుతోంది..

నామినేషన్ రోజే ఎలిమినేషన్ గోల ఏంటి అనుకుంటున్నారా..? ఇంత ముందుగా అంచనా వేయడం కష్టమే అయినా…. రెండోవారంలోనే హౌజ్ అంతా రచ్చ రచ్చగా మారింది.. గత నాలుగు సీజన్లలో ఎక్కడా వినిపించని స్థాయిలో బూతులు దొర్లాయి.. బిగ్ బాస్ హౌజ్ లో అంతా సెలబ్రిటీలే ఉంటారు.. వారికే ఎక్కవగా ఎంట్రీ లభిస్తుంది.. సామాన్యులు అక్కడకి ప్రవేశించడం కష్టం..

అలాంటి సెలబ్రిటీలు తమ నోరుకు పనిచెబుతున్నారు.. ముఖ్యంగా హద్దు మీరి, శృతిమించి మాట్లాడుతున్న మాటలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.. ఒక కంటెస్టెంట్ ని ఉద్దేశించి ఉమా దేవి.. వెర్రి పూ.. అని పలికిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎంతటి నియంత్రణ కోల్పోయినా, సభ్య సమాజంలో అందులోనూ కోట్లాది మంది ప్రేక్షకులు వీక్షిస్తున్న ప్రోగ్రామ్ లో వెర్రి పూ.. అని సంబోధించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. దీంతో, ఉమాదేవికి సీరియస్ వార్నింగ్ తోపాటు హౌజ్ నుండి ఎలిమినేషన్ కూడా ఉంటుందనే చర్చ నడుస్తోంది..

ఇటు, మరో ఇద్దరు కంటెస్టెంట్ లు ప్రియాంక సింగ్, శృతి వర్మ సైతం హౌజ్ లో శృతిమించి వ్యవహరిస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా ప్రియాంక సింగ్.. అందరి విషయంలో ఒకేలా వ్యవహరించకపోయినా, ఉమా దేవిపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.. మొన్న షటప్ అని కామెంట్ చేసిన ప్రియాంక సింగ్.. నిన్న పోవే ఉమా.. అని కామెంట్ చేసింది.. దీంతో, హౌజ్ మేట్స్ మరోసారి నివ్వెరపోయారు..

ఇక, ఈ వారం ఎలిమినేషన్ వేటు పడనుందనే లిస్టులో శ్వేతా వర్మ కూడా ఉన్నారనే చర్చ నడుస్తోంది.. సెకండ్ వీక్ నామినేషన్ సమయంలో శ్వేతా వర్మ ప్రవర్తించిన తీరు హాట్ టాపిక్ గా మారుతోంది.. తనకు నచ్చని ఇద్దరు వ్యక్తులను నామినేట్ చేయడం, వారిపై ఆవేశం, ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆగలేదు శ్వేతా వర్మ.. రంగులు తీసుకువచ్చి వారి ముఖాలపై విసురుగా పూసింది.. దానికి ఇతర హౌజ్ మేట్స్… కళ్లు పోతాయి… కాస్త నెమ్మదిగా రంగు పూయాలని వాదిస్తున్నా.. వినలేదు.. పోతే పోతాయి.. ఐ డోన్ట్ కేర్ అని అమానవీయంగా వ్యవహరించింది..

ఇక్కడ మరో విశేషం ఏంటంటే… అంతకుముందు వరకు శ్వేతా వర్మ మానవత్వం గురించి లెక్చర్ ఇచ్చింది.. కానీ, తానే మానవత్వం లేకుండా అమానవీయంగా వ్యవహరించింది.. ఇదే అంశాన్ని హౌజ్ మేట్ ప్రియా ప్రశ్నించింది.. మానవత్వంపై అంతటి క్లాస్ ఇచ్చి, ఇలా వ్యవహరించడం ఎంత మాత్రం సబబని నిలదీసింది.. ప్రియా ప్రశ్నకు ఆమె తన చర్యలకు సారీ చెబుతూనే సమర్ధించుకోవడం విశేషం..

దీంతో, సెకండ్ వీకెండ్ లో ఈ ముగ్గురిలో ఒకరు లేదా.. ఇద్దరు హౌజ్ నుండి బయటకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.. ఇది ఎంతవరకు నిజమో తేలాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయకతప్పదు..

Post Comment