కెరీర్ ఆరంభంలో పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో ఒక్కసారిగా స్టార్ రేస లోకి దూసుకువచ్చాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి వంటి కల్ట్ మూవీతో యూత్ లో తిరుగులేని క్రేజ్ వచ్చింది. అందుకు తగ్గట్టుగానే మార్కెట్ కూడా యాడ్ అయింది. బట్ ఆ మార్కెట్ పెంచుకునే క్రమంలో మంచి కథలకు ఓటు వేయవలసిన వాడు నోటాపై కాలేశాడు.

కట్ చేస్తే వరుసగా డిజాస్టర్స్ చూస్తున్నాడు. నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ తో హ్యాట్రిక్ ఫ్లాపులు చూశాడు. అయితే మనోడి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అందుకే లైగర వంటి ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ వచ్చింది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ ఆల్ టైమ్ డిజాస్టర్స్ లిస్ట్ లో చేరింది. ఇటు ఖుషీ కూడా సమంత హెల్త్ ఇష్యూ వల్ల పూర్తిగా అటకెక్కింది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సినిమాక సిద్ధమవుతున్నాడు.


విజయ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలోలైగర్ టైమ్ లోనే ఓ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. లైగర్ పోయినా ఈ చిత్రంతో విజయ్ కెరీర్ కు కొత్త టర్న్ వస్తుందని చాలామంది భావించారు. కానీ ఎప్పుడైతే లైగర్ డిజాస్టర్ గా మిగిలిందో అప్పటి నుంచి సుకుమార్ సైలెంట్ అయిపోయాడు. విజయ్ తో సినిమా విషయంలో పూర్తిగా సైలెన్స్ పాటిస్తూ వస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా వినిపిస్తోన్న దాన్ని ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయినట్టే అంటున్నారు.

ప్రస్తుతం విజయ్ తో సినిమా చేసే ఉద్దేశ్యంలో సుకుమార్ లేడట. అతనిప్పుడు పుష్పకు సీక్వెల్ తీస్తున్నాడు. తర్వాత రామ్ చరణ్ తో మూవీ ఉండే ఛాన్స్ ఉంది. అటుపై మళ్లీ అల్లు అర్జున్ లేదా ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుకుంటున్నాడు. ఓవరాల్ గా చూస్తే 2023- 24ల్లో సుకుమార్ డైరీ ఫుల్ అయిపోయింది. ఇక విజయ్ తో సినిమా నిల్ అయిపోయింది.

ఏదేమైనా వరుసగా విజయాలు వచ్చినప్పుడు ఎగెరెగిరి పడ్డాడు విజయ్ దేవరకొండ. అణకువకు ఉండే విలువ ఏంటో ఇప్పుడు అర్థం అవుతుంది. అయితేనేం.. బాగా ఆలస్యం అయిపోయింది కదా..? ఇక గౌతమ్ సినిమా కూడా తేడా కొడితే అతని పరిస్థితి ఏంటో మరి.