పెద్ద హీరో.. చిన్న సినిమా పేద్ద విజయం

ఆడియన్స్ విజువల్ గ్రాండీయర్స్ కంటే కంటెంట్ కే ఎక్కువ ఓటేస్తారని మరోసారి ప్రూవ్ అయింది. కంటెంట్ ఉన్నోడికి కలెక్షన్స్ కు కొదవలేదని నిరూపించారు. అయితే ఏ చిన్న హీరోనో పెద్ద విజయం సాధిస్తే అనుకోవచ్చు. కానీ ఓ పెద్ద హీరో చిన్న సినిమా చేసి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. యస్.. ఈ సినిమా తిరు. ధనుష్‌, నిత్య మీనన్ జంటగా నటించిన సినిమా. ప్రకాష్‌ రాజ్, భారతీరాజా కీలక పాత్రలు చేశారు. రాశిఖన్నా, ప్రియాభవానీ శంకర్ గెస్ట్ రోల్స్ లాంటివి చేశారు. అంటే చెరో పాట కూడా ఉంటుంది. కానీ ప్రధానంగా కనిపించరు. కథగా కూడా చాలా చిన్నది. ఇలాంటి సినిమాతో వంద కోట్ల మార్క్ ను చేరాడు ధనుష్.


ధనుష్ ముందు నుంచీ వైవిధ్యమైన కథలకే ఓటు వేశాడు. కథలను బట్టి వయసు మళ్లిన పాత్రల్లోనూ, తక్కువ ఏజ్ ఉన్న పాత్రల్లోనూ తనను తాను మౌల్డ్ చేసుకున్నాడు. మెప్పించాడు కూడా. అందుకే ధనుష్‌ కు స్టార్డమ్ కంటే స్టార్ యాక్టర్ గా ఎక్కువ పేరుంది. మరోవైపు తన కెరీర్ కూడా ఇతర స్టార్స్ కంటే డిఫరెంట్. హిందీలో మెప్పించాడు. హాలీవుడ్ లోనూ అడుగుపెట్టాడు. ఇప్పుడు తెలుగులో సినిమా చేస్తున్నాడు. అటు నేషనల్ అవార్డ్స్ ను కూడా అందుకున్నాడు. ఇలాంటి కెరీర్ ఇప్పుడు అతని తరం హీరోల్లో ఏ బాషలోనూ ఎవరికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఎలా చూసినా ఇప్పుడు అతను ప్యాన్ ఇండియన్ స్టార్. అలాంటి ధనుష్ తిరు లాంటి కథకు ఓకే చెప్పడం ఆశ్చర్చమే. కానీ అతని కథలు చూస్తే వింతేం అనిపించదు. తన తండ్రి నిర్లక్ష్యం వల్ల తల్లి, చెల్లిని కోల్పోతాడు తిరు.

అప్పటి నుంచి తండ్రంటే ద్వేషం. ఆ ద్వేషంతో చదువు మానేస్తాడు. తండ్రి పోలీస్ అయినా తను మాత్రం ఫుడ్ డెలివరీ బాయ్ గా చేస్తుంటాడు. అతనికో తాత ఉంటాడు. అలాగే చిన్నప్పటి నుంచి పక్కింట్లో ఉండే శోభనతో స్నేహం ఉంటుంది. అలాంటి అతని లైఫ్ లోకి ఇద్దరు అమ్మాయిలు వస్తారు. ఒకరి తర్వాత ఒకరు నో చెబుతారు. అలాంటి ప్రతి సందర్భంలోనూ శోభన తిరుకు తోడుగా ఉంటుంది. చివరికి ఈ ఇద్దరే పెళ్లి చేసుకుంటారు. ఆ మధ్యలో ఓ చిన్న ఎమోషనల్ టచ్ ఉంటుంది.


ఇంతే తిరు సినిమా కథ. ఇంత సింపుల్ స్టోరీ ఎంతోమందికి నచ్చింది. అందుకే వంద కోట్ల క్లబ్ లో చేరిందీ సినిమా. తెలుగులో పెద్దగా పట్టించుకోలేదు కానీ.. తమిళ్ లో మాత్రం తెగ చూశారీ చిత్రాన్ని. ధనుష్‌, నిత్య మీనన్ ల కెమిస్ట్రీతో పాటు ధనుష్‌ – ప్రకాష్‌ రాజ్, ధనుష్‌ – భారతీరాజా మధ్య వచ్చే సీన్స్ ఎంటర్టైన్ చేస్తూనే ఎమోషన్ ను పంచుతాయి.

ఓ చిన్న ఫ్యామిలీ స్టోరీగా వచ్చిన ఈ మూవీ మిడిల్ క్లాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. అలా రెండు వారాల్లో వంద కోట్లు కొల్లగొట్టింది. మొత్తంగా మనం చూపించే కంటెంట్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉంటే కమర్షియల్ గా ఏ మాత్రం లాస్ ఉండదు అని తిరు మరోసారి నిరూపించింది.

Related Posts